మద్దూర్, డిసెంబర్ 26 : సమస్యల పరిష్కారం కోసం పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు భరోసానిచ్చేలా వారి కే సుల విచారణలో పారదర్శకంగా ఛేదించేలా పోలీసులు వి ధులు నిర్వహించాలని డీఎస్పీ కె.సత్యనారాయణ అన్నా రు. వార్షిక తనిఖీల్లో భాగంగా మద్దూర్ పోలీస్‌స్టేషన్‌ను సో మవారం సందర్శించారు. పలు రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు, సి బ్బంది పోటీపడి విధులు నిర్వహించాలని వారికి రివార్డులు ఇవ్వడం జరుగుతున్నదని చెప్పారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలన్నారు. శాం తి భద్రతలు కాపాడడంలో రౌడీలు, కేడీలు, సంఘవిద్రోహ శక్తులపై నిరంతరం నిఘా ఉంచి వారి కదలికలను గమనించాలన్నారు.
రాత్రి సమయంలో పెట్రోలింగ్ నిర్వహించే అ ధికారులు పాత నేరస్తులను తనిఖీ చేయాలని, ఆకస్మికంగా వాహనాల తనిఖీలు చేపట్టాలన్నారు. వీపీవో పోలీస్ అధికారి సంబంధిత గ్రామాలను సందర్శించి ప్రజల సమస్యలపై ఆరా తీయాలన్నారు. సైబర్‌నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. క్రైమ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్ వర్క్ సిస్టం నుంచి దరఖాస్తులను ఎఫ్ఐఆర్లను సీడీఎఫ్ పార్ట్-1 పార్ట్-2 రిమాండ్ సీడీ, చార్జ్ షీట్, కోర్టు డిస్పోజల్ ఐన్లెన్లో ప్రతిరోజు ఎంటర్ చేయాలని అదేశించారు. ప్రతి కేసు లో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలని కేసుల్లో శిక్షలశాతం పెంచాలని సూచించారు. అధికారులు సిబ్బందితో ప్రొయాక్టివ్ పోలీసింగ్ విధులు నిర్వహించాలని, పోలీస్ స్టేషన్ రికార్డులు, సీడీ ఫైల్స్‌లో ఇన్వేస్టిగేషన్ ఎస్వోపీ ప్రకారం క్రమ పద్ధ్దతిలో ఉంచాలన్నారు. కార్యక్రమంలో సీఐ జనార్దన్, ఎస్సై సతీష్, సిబ్బంది పాల్గొన్నారు.