మరికల్, అక్టోబర్ 6: తెలంగాణ ఆడపడుచులకు పెద్దన్నగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిచారని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆన్నారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో ఆయన మహిళలకు బతుకమ్మ చీరలు,యువకులకు క్రీడా సామాగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మట్లాడుతూ దేశంలో ఏ ప్రభుత్వం చేపట్టని సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టారని అన్నారు. అన్ని మతాలవారు పండుగలను సంతోషంగా నిర్వ హించుకునేందుకు ప్రభుత్వం చేయుతనిస్త్తుందని ఆన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పథకం అందని గడప లేదని అన్నారు. ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. కార్యాక్రమంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ గౌని సురేఖారెడ్డి, ఎంపీపీ శ్రీకళ, వైస్ ఎంపీపీ రవికుమార్, సర్పంచులు రాములునాయక్, అరుంధతి, భాస్కర్, పద్మమ్మ, ఎంపీటీసీలు గోపాల్, రాజు, ఉప సర్పంచులు భాస్కర్ నాయక్, వసుంధర, బీఆర్ఎస్ నాయకులు తాసీల్దార్ సునీత, ఏపీఎం చెన్నప్ప, తదితరులు పాల్గొన్నారు.
పేట మండలంలో పంపిణీ
నారాయణపేట రూరల్, అక్టోబర్ 6: పేట మండల ం లోని అప్పిరెడ్డిపల్లి, జాజాపూర్, అంత్వార్తదితర గ్రామాల్లో శుక్రవారం మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. అప్పిరెడ్డిపల్లిలో ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్‌రెడ్డి , సర్పంచ్ ప్రభావతి,ఎంపీటీసీ జయలక్ష్మీ పంపిణీ చేశారు. జాజాపూర్‌లో ఎంపీడీవో వెంకటయ్య,సర్పంచ్ కోట్ల సుగందమ్మ,రైతు బంధు సమితి జిల్లా సభ్యులు కోట్ల జగన్మోహన్రెడ్డి,ఎంపీటీసీ శేఖర్,అంత్వార్‌లో ఎంపీడీవో వెంకటయ్య, సర్పంచ్ రాములు చీరలు పంపిణి చేశారు.
మక్తల్‌లో..
మక్తల్‌టౌన్/అర్బన్, అక్టోబర్6: మక్తల్ మండలం మంథన్గౌడ్లో జెడ్పీ చైర్పర్సన్ వనజ బతుకమ్మ చీరల పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో జ్యోతి, అడిషనల్ డీఆర్డీవో అంజయ్య, సర్పంచ్ మహదేవమ్మ, ఉపసర్పంచ్ కృష్ణయ్యగౌడ్ తదితరులు ఉన్నారు.
మక్తల్ పట్టణంలోని 12 వార్డులో కౌన్సిలర్ ఇర్ఫాన్ అన్వర్ బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమం లో కోఆప్షన్ జ్యోతి, టౌన్ మహిళా అద్యక్షురాలు రాధిక, సాదిక్, తదితరులు పాల్గొన్నారు.
దామరగిద్దలో…
దామరగిద్ద, అక్టోబర్ 6: మండంల కేంద్రంతో పాటు సజనాపూర్, బాపన్‌పల్లి గ్రామాల్లో సర్పంచ్‌లు వన్నడి ఆశమ్మ, కనకప్ప, సత్యమ్మ శుక్రవారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ బక్క నర్సప్ప, భీమయ్యగౌడ్, నాయకులు కోడ్లి శరణప్ప, మాజీ సర్పంచులు నాగప్ప, తిప్పణ్ణ, శెట్టి శ్రీనివాస్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
కోస్గిలో..
కోస్గి రూరల్, అక్టోబర్6 : మండలంలోని సర్జఖాన్‌పేట, కోస్గి పట్టణంలోని అన్ని వార్డుల్లో శుక్రవారం బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ శాసం రామకృష్ణ, మున్సిపాల్ చైర్పర్సన్ శిరీష, జెడ్పీటీసీ ప్రకాశ్ రెడ్డి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
కృష్ణలో…
కృష్ణ, అక్టోబర్6 : మండలంలోని గుడెబల్లూర్ గ్రామంలో సర్పంచ్ మహదేవమ్మ ప్రజాప్రతినిదులతో కలిసి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు సంతోశ్, వార్డు సభ్యులు, వీవో కృష్ణ, లింగప్ప, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మాగనూర్‌లో…
మాగనూర్, అక్టోబర్ 6: మండల వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాలలో గ్రామ పంచాయితీ కార్యాలయాల్లో శుక్రవారం బతుమ్మ చీరలు పంపిణీ చేసినట్లు ఎంపీడీవో శశికళ ప్రకటనలో తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచులు, ఉప సర్పంచులు,వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.
నర్వలో…
నర్వ, అక్టోబర్ 6 : మండలంలోని పెద్దకడ్ముర్, లం కాల, యాంకీ, కొత్తపల్లి, ఎల్లంపల్లి, లక్కర్‌దొడ్డి తదితర గ్రామాల్లో శుక్రవారం ఎంపీపీ జయరాములు శెట్టి బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో పీఎసీసీఎస్ వైస్ చైర్మన్ లక్ష్మణ్న, సర్పంచులు , ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు కిరణ్‌ప్రకాశ్ రెడ్డి,చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
ఊట్కూర్‌లో…
ఊటూర్ , అక్టోబర్ 6 : మండలంలోని చిన్నపొర్ల, మల్లేపల్లి, అమీన్పూర్ గ్రామాల్లో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అశోక్ కుమార్ గౌడ్ రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, సర్పంచులు మాణిక్యమ్మ, యశోద, ఉప సర్పంచ్ బాలస్వామి, ఎంపీటీసీ సభ్యులు రవీందర్ రెడ్డి, అనిత, బీఆర్ఎస్ నాయకులు శేఖర్ రెడ్డి, కతలప్ప తదితరులు పాల్గొన్నారు.