మహబూబ్‌నగర్, జూలై 17 (నమస్తే తెలంగా ణ ప్రతినిధి) : మొహర్రం ఉత్సవాల్లో భాగంగా కోయిలకొండలో తొమ్మిది రోజులుగా ప్రత్యేక పూ జలందుకున్న బీబీ ఫాతిమా నిమజ్జనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన కోయిలకొండ మొహర్రం ఉత్సవాలు బుధవారంతో ముగిశాయి. రాష్ట్ర నలుమూలల నుంచి వేలసంఖ్యలో భక్తులు కోయిలకొండ కోటపై కొలువుదీరిన బీబీ ఫాతిమాను దర్శించుకొని కందూర్లు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
అదేవిధంగా బీబీ ఫాతిమాకు సర్కారు నుంచి చక్కెరను సమర్పించారు. అనంతరం కోటపై నుంచి పీర్లను కాగడాలు, వాయిద్యాలతో కోట కింది వరకు తీసుకొచ్చారు. పాత పోలీస్‌స్టేషన్ వద్ద ఏర్పా టు చేసిన అగ్నిగుండంలో భక్తులు నడవడం అం దరి నీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కోలాటాలు బొడ్డెమ్మలు, భజనలతో కోయిలకొండ గ్రామం మార్మోగింది. గ్రామంలో దుకాణాలు, సర్కస్‌లు వెలిశాయి.
మధ్యాహ్నం బీబీ ఫాతిమా పీర్లతోపా టు గ్రామంలో ప్రతిష్ఠించిన మరో 30 పీర్లను ప్ర ధాన రహదారిపై ఊరేగిస్తూ కోయిలకొండ పెద్ద చె రువు వద్ద నిమజ్జనం చేయడంతో మొహర్రం ఉత్సవాలు ముగిశాయి. స్థానిక ఎస్సై శ్రీకాంత్‌తోపాటు జిల్లా కేంద్రానికి చెందిన వివిధ హోదాల్లో ఉన్న పోలీస్ అధికారుల నిఘా మధ్యలో ప్రశాంతంగా మొహర్రం ఉత్సవాలు కొనసాగాయి.