భారమైనా భరిస్తూ.. నిరంతర వెలుగులు
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సకల సదుపాయాలను కల్పిస్తున్నది. ఇందులో భాగంగా గృహాలు, పరిశ్రమలు, వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందిస్తున్నది. అయితే, కొందరు విద్యుత్ వినియోగదారులు బకాయిలను చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ‘కరెంట్ బిల్లులు బకాయిలు ఉంచడం సరైంది కాదు.. బిల్లులు చెల్లించి.. విద్యుత్ సంస్థలకు అండగా నిలవండి.. లేకుంటే నోటీసులు ఇవ్వకుండా విద్యుత్‌ను కట్ చేస్తాం..’ అని విద్యుత్ శాఖ అధికారులు ప్రత్యేక వాహనాల ద్వారా ప్రచారం చేస్తున్నారు
- గృహాలు, పరిశ్రమలకు కరెంట్ సరఫరా
- విద్యుత్ బిల్లులు చెల్లించడంలో కొందరి నిర్లక్ష్యం
- మహబూబ్‌నగర్‌లో గతనెల సుమారు రూ.5 కోట్ల బకాయిలు
- సకాలంలో చెల్లించి సహకరించాలని కోరుతున్న విద్యుత్ శాఖ
మహబూబ్‌నగర్, అక్టోబర్ 17 : రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సకల సదుపాయాలను కల్పిస్తున్నది. ఇందులో భాగంగా గృహాలు, పరిశ్రమలు, వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందిస్తున్నది. అయితే, కొందరు విద్యుత్ వినియోగదారులు బకాయిలను చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ‘కరెంట్ బిల్లులు బకాయిలు ఉంచడం సరైంది కాదు.. బిల్లులు చెల్లించి.. విద్యుత్ సంస్థలకు అండగా నిలవండి.. లేకుంటే నోటీసులు ఇవ్వకుండా విద్యుత్‌ను కట్ చేస్తాం..’ అని విద్యుత్ శాఖ అధికారులు ప్రత్యేక వాహనాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. అయినా కొందరు మాత్రం ఇవేవీ పట్టించుకోవడం లేదు. ఇదిలా ఉండగా, ప్రభుత్వం విద్యుత్‌ను అధిక ధరను కొనుగోలు చేసి వినియోగదారులకు తక్కువ ధరకు అందిస్తున్నది.
ప్రభుత్వం ఒక్కో యూనిట్‌ను రూ.12 నుంచి రూ.13కు కొనుగోలు చేసి గృహాల నుంచి పరిశ్రమల వరకు స్లాబ్‌ను పరిగణలోకి తీసుకుంటూ రూ.3 నుంచి రూ.8 వరకు అందుబాటులో ఉంచుతున్నది. ప్రజలపై భారం పడకుండా సర్కార్ చర్యలు తీసుకుంటున్నది. జిల్లా వ్యాప్తంగా విద్యుత్ కనెక్షన్లు కూడా అధికంగా ఉన్నాయి. గృహాలకు సంబంధించి 3.81 లక్షలు, వ్యవసాయానికి 1.08 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ఉచితంగా విద్యుత్‌ను అందిస్తున్నది. గృహ, పరిశ్రమల నుంచి మాత్రమే స్లాబ్‌ల ప్రకారం వసూలు చేస్తున్నది. కానీ, కొందరు మాత్రం ప్రభుత్వానికి సహకరించకుండా బిల్లులు చెల్లించడంలేదు. మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో దాదాపుగా రూ.138.22 కోట్లు కరెంట్ బిల్లులు వసూలు కావాల్సి ఉండగా.. రూ.133.72 కోట్లు వసూలవుతున్నది. మరో రూ.4.51 కోట్లను వినియోగదారులు చెల్లించడం లేదు. ఇప్పటికైనా స్పందించి బకాయిదారులు బిల్లులు చెల్లించి తమకు సహకరించాలని విద్యుత్ శాఖ ఎస్ఈ ఎంఎస్ఎన్ మూర్తి కోరుతున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

