Achampet | అచ్చంపేట, మే 20 : నీటి సంపులో వేసి కూతుర్ని చంపిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండల పరిధిలోని చెన్నంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నంపల్లి గ్రామానికి చెందిన మేకల ఎల్లమ్మ, రాములు దంపతులకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి కలరు. అందులో రెండవ అమ్మాయి మేకల నవనీత (6)ను సోమవారం అర్ధరాత్రి తల్లి మేకల ఎల్లమ్మ నీటి సంపులో పడేసింది. గంట తర్వాత మేకల రాములు తమ్ముడు చూడడంతో వెంటనే నీటిలో పడేసిన నవనీతను వెలికి తీసేసరికి మృతి చెందింది. మేకల ఎల్లమ్మ గత ఐదు నెలల క్రితం భర్త రాములును గొడ్డలితో నరికి చంపింది. ఆ ఘటన మరువక ముందే కూతుర్ని కూడా చంపడంతో మేకల ఎల్లమ్మపై మండిపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఎల్లమ్మను అదుపులోకి తీసుకున్నారు.