కోతలకు చేయిచ్చారు..
యా దేశంల లేనట్ల సీఎం కేసీఆర్ సారు ఎవుసానికి 24 గంటల కరెంట్‌ను ఫ్రీగా ఇచ్చిండు. రైతులు మంచిగుండాలె.. పంటలు బాగా పం డాలె.. అని ఎన్నెన్నో చెప్పిండు.. చేసిండు. కరెంట్ పోవుడనేదే లేకుండా చేసిండు. ఇప్పుడేమో ఇష్టమొచ్చినట్ల కరెంట్ పోతుంది. పోతే ఎప్పుడొస్తదో కూడా తెలుస్తలేదు.
- కాంగ్రెస్ సర్కారు పాలనలో కరెంట్ కోతలు..
- ఉన్నకాడికి నీటిని వాడుకుందామంటే కరెంట్ లేదు..
- కేసీఆర్ హయాంలో హాయిగా నిద్రపోయాం..
- ఇప్పుడు కంటిమీద కునుకు లేకుండా గోసపడుతున్నాం..
- ఆవేదన వ్యక్తం చేస్తున్న అన్నదాతలు
కరెంట్ కోతలు ఎక్కువయ్యాయి..
యా దేశంల లేనట్ల సీఎం కేసీఆర్ సారు ఎవుసానికి 24 గంటల కరెంట్‌ను ఫ్రీగా ఇచ్చిండు. రైతులు మంచిగుండాలె.. పంటలు బాగా పం డాలె.. అని ఎన్నెన్నో చెప్పిండు.. చేసిండు. కరెంట్ పోవుడనేదే లేకుండా చేసిండు. ఇప్పుడేమో ఇష్టమొచ్చినట్ల కరెంట్ పోతుంది. పోతే ఎప్పుడొస్తదో కూడా తెలుస్తలేదు. పంటలకు, ఇండ్లకు అదే పరిస్థితి. ఫ్రీ కరెంట్ అ న్నరు.. కానీ కోతలు ఎక్కువైనయి. ఇలాగైతే ఫ్రీ ఇచ్చి ఏం లాభం? రైతులు, వ్యాపారులకు ఇబ్బందులు తప్పవు. ఇండ్లల్ల అయితే పరిస్థితి దారుణంగా ఉంది. కేసీఆర్ సారు ఉన్నప్పుడు అందరి గురించి ఆలోచించి 24 గంటల కరెంటిచ్చిండు. ఇప్పుడేమో రాత్రింబవళ్లు తేడా లేకుండా కోతలు పెడుతున్నారు. కరెంటు సారోళ్లకి అడిగితే పైనుంచి పోతుంది అంటరు. ఎప్పుడుపడితే అప్పుడు కరెంట్ పోతే ఫిర్యాదు చేయమని రేవంత్‌రెడ్డి సారు చెబుతున్నడు. సమస్యను చెప్పుకుందామంటే అధికారులు ఫోన్లు ఎత్తరు. ఎవరికి చెప్పినా వేస్ట్‌గానే ఉంది. తెలంగాణ రాకముందు పడిన కష్టాలు మళ్లీ గుర్తొస్తున్నయి. ఇప్పటికైనా కాంగ్రెసోళ్లు కరెంట్ మీద దృష్టిపెట్టి నిరంతరం ఇస్తే బాగుంటది. పాత సర్కారోళ్లు అట్ల చేసిండ్రు, ఇట్ల చేసిండ్రు అనుకుంట ఉంటే.. ప్రజల పరిస్థితి ఎప్పుడు అర్థం చేసుకుంటరు. గొర్రెలెన్ని సచ్చినయనేది ముఖ్యం కాదు.. వడ్లెన్ని పండినయనేదే ముఖ్యం.
– బోయ బలరాం, పిన్నెంచెర్ల, ఆత్మకూరు మండలం, వనపర్తి జిల్లా
కాంగ్రెస్ రాకతో మళ్లీ ‘కట్’కట..
అప్పట్లో కరెంట్ కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఆరు గంటలు కూడా ఇవ్వకపోయేది. పగలు మూడు గంటలు, రాత్రి మూడు గంటలు ఇచ్చేటోళ్లు. చీకట్ల పొలంకాడ నిద్ర కాసేది. ఒక్కోసారి కరెంట్ ఇచ్చేటోళ్లు కాదు. తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ 24 గంటల కరెంటిచ్చిండు. కరెంట్ మీద ఫికర్ లేకుండా వేరే పని చేసుకునేవాళ్లం. కరెంట్ కోసం రాత్రి పూట పొలం కాడికి పోతలేం. ఇంటి వద్ద కుటుంబంతో హాయిగా నిద్రపోతున్నాం. కేసీఆర్ వచ్చినంకనే కరెంట్ కష్టాలు తీరాయి. కాంగ్రెస్ రావడంతో కష్టాలు మళ్లీ మొదలయ్యాయి.
– మొగులాన్, రైతు, ఉమ్మాపూర్, వంగూరు మండలం
ఇచ్చే కంటే తీసే సమయమే ఎక్కువ..
వానకాలంలో వర్షం ఎప్పుడొస్తదో తెల్వదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉచిత కరెంట్ ఇస్తమన్నరు కానీ.. ఇచ్చే టైంకన్నా తీసే టైం ఎక్కువగా ఉంది. పొలం పనులు కావడంతో పగలంతా పొలంకాడికి వెళ్తున్నాం. రాత్రి పూట ప్రశాంతంగా ఇంటికాడ పడుకుందమంటే సమయం, సందర్భం లేకుండా కరెంట్ తీస్తున్నరు. రాత్రి పూట కరెంట్ లేక కంటిమీద కునుకు లేకుండా పోయింది. చాలా ఏండ్లు కరెంట్ సమస్య మర్చిపోయి ప్రశాంతంగా ఉన్నాం. ఒకవేళ పోయినా వెంటనే సరిచేసి కరెంటిచ్చెటోళ్లు. ఇప్పుడు కరెంట్ ఎందుకు తీసిండ్రని అడిగితే పైనుంచి పోయింది.. మేమేం చేస్తమని సమాధానం చెబుతున్నరు.
– కుర్వ శ్రీనివాసులు, ధర్మాపూర్, అమరచింత మండలం, వనపర్తి జిల్లా
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

