యాసంగి యాడికొస్తదో..!
యాసంగి సాగు ప్రశ్నార్థకంగా మారిం ది. కరెంట్ కష్టాలు అధికమవడం.. జూ రాల, నెట్టెంపాడ్, ఆర్డీఎస్, తుమ్మిళ్ల త దితర ప్రాజెక్టుల కింద నీటి లభ్యత లేకపోవడంతో రై తులు క్రాఫ్ హాలిడే ప్రకటించారు. బోర్ల కింద అక్కడక్కడా సాగు చేసిన రైతులకు కరెంట్ కష్టాలు తప్పడం లేదు.
- నెల రోజులకే సాగుపై సన్నగిల్లుతున్న ఆశలు
- మొదలైన కరెంట్ కష్టాలు
- లో ఓల్టేజీ కారణంగా కాలిపోతున్న మోటర్లు
- స్టార్టర్లకు సింగిల్‌ఫేస్ కాయలు అమర్చుకుంటున్న వైనం
- అదనపు బోర్లతో అష్టకష్టాలు
- అడుగంటిన భూగర్భజలాలు
- ఎండుతున్న పంటలు
- కాంగ్రెస్ పాలనపై అన్నదాతల ఆగ్రహం
యాసంగి సాగు ప్రశ్నార్థకంగా మారింది. కరెంట్ కష్టాలు అధికమవడం.. జూ రాల, నెట్టెంపాడ్, ఆర్డీఎస్, తుమ్మిళ్ల త దితర ప్రాజెక్టుల కింద నీటి లభ్యత లేకపోవడంతో రై తులు క్రాఫ్ హాలిడే ప్రకటించారు. బోర్ల కింద అక్కడక్కడా సాగు చేసిన రైతులకు కరెంట్ కష్టాలు తప్పడం లేదు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులు ఎప్పుడైనా పొలాల వద్దకు వెళ్లి మోటర్ల ద్వారా సాఫీగా నీరు పారించుకునే వారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. జోగుళాంబ గద్వాల జిల్లాలో పత్తి, వరి, వేరుశనగ, కందులు, జొ న్న, మొక్కజొన్న, ఆముదం, పొగాకు తదితర పంటలు సుమారు 1,07,075 ఎకరాల్లో వివిధ పంటలు సా గు చేయగా.. పంటలు కాపాడుకోవడానికి రైతులు నానా అవస్థలు పడుతున్నారు.
పాత పద్ధతి షురూ..
లో ఓల్టేజీ సమస్యతో రైతులు సతమమతమవుతున్నారు. రాత్రి 11గంటల నుంచి మరుసటి రోజు సాయంత్రం వరకు వ్యవసాయానికి విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు. త్రీఫేస్ సరిగా రాకపోవడంతో రై తులు పాత పద్ధతికి వచ్చారు. త మ స్టార్లకు సింగ్ల్ ఫేస్ కాయలు అమ ర్చి మోట ర్లు నడుపుకొంటున్నారు. కరెంట్ పోయిన ప్రతిసారీ రైతు మోటర్ వద్దకు వెళ్లలేక ఆటో స్టార్టర్లు బిగించుకుంటున్నారు. లో ఓల్టేజీ సరఫరా అవుతుండడంతో బోరుమోటర్లు కాలిపోతున్నాయి. మోటరు రిపేరు చేయించుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. రిపేరుకు తీసికెళ్తే ఒకటి రెండు రోజుల సమయం పడుతుండడంతో పంటలు ఎండిపోతున్నాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే ఉద్యోగాలు ఊడగొడుతామని గొప్పలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో రైతులకు నాణ్యమైన విద్యుత్ అందక ఇబ్బందులు పడుతున్నారు.
తగ్గిన భూగర్భ జలాలు..
కేసీఆర్ సర్కారు హయాంలో రిజర్వాయర్లు, చెరువులను నింపింది. దీంతో జిల్లా అంతటా భూగర్భజలాలు పెరిగాయి. బోర్లు పుష్కలంగా దుంకేవి. ప్రస్తుతం జిల్లా లో ఎక్కడా నీళ్లు లేకపోవడంతోపాటు ఎండల కారణంగా భూగర్భజలాలు తగ్గి బోర్లు పనిచేయడం లేదు. గతేడాది 5.5 మీటర్ల ఎత్తులో భూగర్భజలాలు ఉండగా, ప్రస్తుతం 6.53 మీటర్లకు పడిపోయింది.
పదేండ్లు పండుగలా సాగిన సాగు మూడు నెలల్లోనే మూణ్నాళ్ల ముచ్చటగా మారింది. కరెంటు కోతలు.. పడావుపడిన ప్రాజెక్టులు, నెర్రెలుబారిన కాల్వలు, చెరువు, కుంటలకుతోడు భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయాయి. దీంతో బోరుబావుల కింద అక్కడక్కడా సాగు చేసిన పంటలు సైతం కరెంట్ లో ఓల్టేజీతో బోర్లు కాలిపోయి ఎండుముఖం పట్టాయి. కండ్ల ముందే పంట కుదేలవుతుండడంతో రైతులు మోటర్లతో రిపేరు షాపులకు పరుగులు పెడుతున్నరు. బోర్లు పోయిన చోట మరో బోరు వేసి పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. యాసంగి సాగు నెల రోజులకే ఇన్ని సమస్యలతో సతమతమవుతుండగా, మరో మూడు నెలలు పంటలను ఎలా రక్షించుకోవాలో పాలుపోక రైతులు ఆవేదన చెందుతున్నారు.
– గద్వాల, ఫిబ్రవరి 29
పంట చేతి కొస్తదో.. రాదో..
కేసీఆర్ సర్కారే బాగుండే. నీళ్లకు, కరెంట్‌కు ఎప్పుడూ ఇంత చింతలేదు. ఎప్పుడైనా పొలాలకు వెళ్లి మోటర్ల ద్వారా నీరు పారించుకునేటోళ్లం. ఈ యాసంగిలో కరెంటు మంచిగ వొస్తలేదు. లో ఓల్టేజీతో మోటర్లు కాలిపోతున్నాయి. పొలంలో మోటర్ కాలిపోవడం వల్ల రిపేరు చేయించుకోవడానికి ధరూర్‌కు వచ్చా. బోరులో నీరు తక్కువగా రావడంతో మరో బోరు వేయిస్తున్నా. యాసంగి అయిపోయేటప్పటికీ పంట చేతికొస్తుందో లేదో తెలియదు.
– ఆంజనేయులు, రైతు, మార్లబీడు, ధరూరు మండలం
ఐదెకరాలు ఎండిపోతున్నది..
నాకున్న ఐదున్నర ఎకరాలలో ఒక బోరు వేశా. రెండు ఇంచుల నీరు మంచిగా వొచ్చింది. కొన్నాళ్లు బాగానే నడిచిన బోరు ఈ మధ్య నీరు ఆగి ఆగి వస్తుండడంతో పంట ఎండిపోతున్నది. కాపాడుకోవడానికి గత ఆదివారం మరో బోరు వేశా. అందులో నీళ్లు తక్కువనే వస్తున్నయి. గట్టు ఎత్తిపోతల పనులు పూర్తయితే మాకు నీటి కష్టాలు తప్పుతాయి. యాసంగి పంట చేతికొస్తుందో లేదో తెలియడం లేదు. ఇట్లయితే సాగు పదేండ్ల కిందటి లెక్క భూములు పడావు పడ్తయి.
– భీమేశ్, చెట్ల మల్లాపురం,
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

