సాగుకు సిద్ధం
రైతులు వానకాలం సాగుపై కొండంత ఆశతో పొలాలను సిద్ధం చేస్తున్నారు. గత వానకాలం అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి సన్నద్ధమవుతున్నారు. గత వానకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతులు అనుకున్న స్థాయిలో దిగుబడి సాధించలేకపోయారు.
- జోగుళాంబ గద్వాల జిల్లాలో పెరగనున్న సాగు విస్తీర్ణం
- అధికశాతం రైతులు పత్తిసాగు వైపే..
- ఎరువులు, విత్తనాలకు సంబంధించి ప్రణాళికలను ప్రభుత్వానికి పంపిన అధికారులు
గద్వాల, జూన్ 4 : రైతులు వానకాలం సాగుపై కొండంత ఆశతో పొలాలను సిద్ధం చేస్తున్నారు. గత వానకాలం అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి సన్నద్ధమవుతున్నారు. గత వానకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతులు అనుకున్న స్థాయిలో దిగుబడి సాధించలేకపోయారు. దీంతో ప్రస్తుతం బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. వేసవిలో కూడా అక్కడక్కడా వర్షాలు కురుస్తుండడంతో అన్నదాతలు పొలాలను దుక్కి దున్ని విత్తేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. సాగుకు సంబంధించి వ్యవసాయ అధికారులు ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపారు. సాగునీరు పుష్కలంగా ఉండడంతో ఈసారి సాగు ఎక్కువ విస్తీర్ణం లో చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తుమ్మిళ్ల, ఆర్డీఎస్, జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టులే కారణం. ఎగువన వర్షాలు కురిస్తే ఈ ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటాయి. ఫలితంగా ఆ నీటిని రిజర్వాయర్లలోకి పంపింగ్ చేసి అక్కడి నుంచి చెరువులు నింపడంతో వాటికింద ఆయక ట్టు కొంతమేర పెరిగే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. దీనికి తోడు బోరుబావులలోనూ నీటిశాతం పెరగడంతో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. అందుకు అనుగుణంగా ఎరువులను అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికను అందజేశారు. విత్తేనాటికి రైతులకు అవసరమైన ఎరువులను సిద్ధం చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నది. ప్ర స్తుతం జిల్లాలో ఎరువుల కొరత లేకున్నా విత్తనాల కొరత వేధిస్తున్నది. అధికారుల అవసరమైన ఇండెంట్‌ను పెట్టగా ఇప్పటివరకు జిల్లాకు కేవలం 650 క్వింటాళ్ల జీలుగ విత్తనాలను మాత్రమే ప్రభుత్వం సరఫరా చేసింది. వర్షాలు కురిస్తే రైతులకు విత్తన సమస్య తలెత్తే అవకాశం ఉన్నది. రైతులకు అవసరమైన ఎరువులను ప్రభుత్వం గోదాంలో అందుబాటులో ఉంచుతుండడంతో రైతులు ధీమాగా సాగుకు సన్నద్ధమవుతున్నారు. తొలకరి పులకరిస్తే రైతులు సాగు పనుల్లో నిమగ్నం కానున్నారు. గత ప్రభుత్వం ఐదువేల ఎకరాలకో క్లస్టర్ ఏర్పాటు చేసి ఏఈవోలను కేటాయించింది. ఇది కూడా సాగు పెరగడానికి ఒక కారణం.
ప్రధాన పంటలు సాగు..
జిల్లా రైతులు వానకాలంలో ఎక్కువగా పత్తి, వరి, వేరుశనగ, పెసర, మొక్కజొన్న, కంది, ఆముదం, పొద్దుతిరుగుడు, అనుములు, మిర్చి, ఉల్లి పంటలను సాగు చేస్తారు. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలోని 13 మండలాల్లో సాగుకు సంబంధించి ప్రణాళికలను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. గత వానకాలంలో జిల్లాలో 1,48,156 హెక్టార్లలో రైతులు వివిధ పంటలను సాగు చేశారు. కాగా ఈ వానకాలంలో 1,70,379 హెక్టార్లలో సాగు చేస్తారని అధికారుల అంచనా. అందుకు అవసరమైన ఎరువులు, విత్తనాలకు సం బంధించిన ప్రణాళికలను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపినట్టు జిల్లా వ్యవసాయ అధికారి గోవిందునాయక్ తెలిపారు.
పంటల సాగు ఇలా..
జిల్లాలోని పంటలు సాగు వివరాలు ఇలా ఉన్నాయి. 68, 046 హెక్టార్లలో పత్తి పంట సాగవుతుందని అధికారులు అం చనా వేస్తున్నారు. గత వానకాలంలో 59,170హెక్టార్లలో సా గు చేశారు. గతేడాది వరి పంట 32,830 హెక్టార్లలో సాగు చేయగా ఈ ఏడాది 37,755 హెక్టార్లలో సాగు చేయనున్నా రు. కందులు గతేడాది 9,130 హెక్టార్లలో సాగు చేయగా ఈ ఏడాది 10,500 హెక్టార్లలో.. మొక్కజొన్న గతేడాది 5,310 హెక్టార్లలో సాగు చేయగా ఈ ఏడాది 6, 107, వేరుశనగ గతేడాది 3,060హెక్టార్లలో చేయగా ఈ ఏడాది 3,519హెక్టార్లలో సాగు చేయన్తున్నట్లు అంచనా వేశారు. మిర్చి పంట గత వానకాలంలో 26,380 హెక్టార్లలో సాగు చేయగా ఈ వానకాలం 30,337 హెక్టార్లలో సాగు చేయనున్నారు. ఆయిల్ సీడ్స్‌కు సంబంధించి గతేడాది 9,840 హెక్టార్లలో సాగు చేయగా ఈ ఏడాది 11,316 హెక్టార్లు, ఆముదం గత వానకాలం 590 హెక్టార్లలో సాగు చేయగా ఈ ఏడాది 679హెక్టార్లలో సాగు చేస్తారని అంచనా వేశారు. పొగాకు గత వానకాలంలో 990 హెక్టార్లలో.. ఈ వానకాలం 1,130హెక్టార్లలో, ఇతర పంటలు 985 హెక్టార్లలో సాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు.
ఎక్కువ శాతం పత్తి వైపే..
పత్తికి ప్రభుత్వం గరిష్ఠంగా మద్ధతు ధర ఇస్తుండగా.. మార్కెట్లో ఎక్కువ ధర పలుకుతుండడంతో రైతులు పత్తి సాగుపై మొగ్గు చూపుతున్నారు. వ్యవసాయశాఖ అధికారులు కేవలం నల్లరేగడిలో మాత్రమే పత్తి పంట సాగు చేయాలని సూచిస్తున్నా రైతులు మాత్రం అన్ని రకాల పొలాల్లో పత్తి పంటను సాగు చేయడానికి సిద్ధమవుతున్నారు. గతేడాది ఇక్కడున్న నీటి వనరులు, మద్దతు ధరను అంచనా వేసుకొని 59,170 హెక్టార్లలో పత్తి పంటను సాగు చేశారు. ఈ ఏడాది వానకాలంలో సుమారు 68,046 హెక్టార్లలో పత్తి సాగు చేస్తారని అధికారుల అంచనా. ఈ వానకాలంలో రైతులు అదనంగా 8,876 హెక్టార్లలో సాగు చేయనున్నారు.
ఎరువులు సిద్ధం..
రైతులకు సరిపడా ఎరువులను అధికారులు సిద్ధంగా ఉం చారు. ఈ వానకాలానికి 1,13,922 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని అంచనా వేశారు. అందులో యూరి యా 35,134 మెట్రిక్‌టన్నులు, డీఏపీ 12,919, ఎంవోపీ 5,944, సూపర్ 4,073, ఏఎస్ 2,670, కాంప్లెక్స్ ఎరువులు 53,173 మెట్రిక్ టన్నులు అవసరమవుతాయని అంచనా వేశారు. రైతులు మొదటి విడుతలో మందులు చల్లుకోవడానికి అవసరమైన నిల్వలను ప్రభుత్వం సిద్ధంగా ఉంచింది.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

