కొల్లాపూర్, డిసెంబర్ 2 : కొల్లాపూర్ పట్టణంలో రూ.8 కోట్ల వ్యయంతో నూతనంగా మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ భవన సముదాయాలను ఆధునిక హంగులతో డిజైన్‌ను రూపొందించి నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి వెల్లడించారు. కొత్తగా షాపింగ్ నిర్మాణాల కోసం శుక్రవారం మున్సిపల్ కమిషనర్ రాజయ్య, ఏఈ విద్యాసాగర్‌రెడ్డితో కలిసి ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్న షాపుల ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీరం మాట్లాడుతూ పట్టణం నడిబొడ్డున నూతనం గా ఆధునిక హంగులతో నిర్మించే షాపింగ్ కాంప్లెక్స్ భవన సముదాయాలతో పట్టణానికే అందం రానునున్నదని పేర్కొన్నారు. రూ.8కోట్లతో కొల్లాపూర్ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి మంజూరైనట్లు ఆయన తెలిపారు.
కొల్లాపూర్ పట్టణ శివారులో నూతనంగా నిర్మించిన మాతా శిశు సంరక్షణ దవాఖానలో ప్రజల సౌకర్యార్థం ఎమ్మెల్యే తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన సురక్షిత(ఆర్వో ప్లాంట్)తాగునీటి ప్లాంటును శుక్రవారం ఎమ్మె ల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ద వాఖాన సిబ్బంది ఎమ్మెల్యేను పూలమాలతో సన్మానించా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీరం మాట్లాడుతూ ప్రజల కు ఎల్లవేళ్లలా అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అం దించాలని వైద్య సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో దవాఖాన అభివృద్ధి కమిటీ చైర్మన్ కాటం జంబులయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ కిషన్‌నాయక్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు నిరంజన్, కౌన్సిలర్లు పస్పుల కృష్ణ, సిం గిల్‌విండో వైస్ చైర్మన్లు స్వామి, శ్రీనివాస్‌యాదవ్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పరశురాంగౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బిజ్జ దశరథం, నాయకులు మూలే కేశవులు, చంద్రశేఖరాచారి, ఖాదర్‌పాషా, బొరెల్లి మహేశ్, గోపాలమల్ల య్య, ఎల్ఐసీ పాషా, బిజ్జ అర్జున్, గడవండ్ల శ్రీనివాసులు, పార్మాసిస్ట్ జీకే వెంకటేశ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
కోడేరు, డిసెంబర్ 2 : మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న గంగమ్మ ఆల య నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. మండలంలోని నర్సాయపల్లి గ్రామంలో శుక్రవారం గంగామాత విగ్రహానికి ప్రత్యేక పూజలు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ఒక్కరూ శాంతియుతంగా జీవించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ కమళేశ్వర్రావు మత్స్యశాఖ తాలూకా అధ్యక్షుడు ఆంజనేయులు, నర్సాయపల్లి సొసైటీ అధ్యక్షుడు నాగరాజు, మాజీ ఉపసర్పంచ్ గోపాల్, మాజీ అధ్యక్షుడు వెంకటస్వామి, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు బాలస్వామి, ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ లింగస్వామి, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
కొల్లాపూర్‌రూరల్, డిసెంబర్ 2 : సీఎంఆర్ఎఫ్ పథకం నిరుపేదలకు వరంగా మారిందని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. గురువారం కొల్లాపూర్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బాధితులకు రూ.4,56,000 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కొల్లాపూర్‌కు చెందిన కవితకు రూ. 2.50లక్షలు, వెంకటస్వామికి రూ. 44వేలు, అరుణకుమారికి రూ.12వేలు, పెంట్లవెల్లికి చెం దిన భాస్కర్‌కు రూ.1.50లక్షల చెక్కులను ఎమ్మెల్యే బీరం అందజేశారు. కార్యక్రమంలో బాధితులతోపాటు ఆయా వార్డులకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కొల్లాపూర్‌లో అయ్యప్పస్వాముల దీక్షలు, పడిపూజలు ఘనంగా కొనసాగుతున్నాయి. అయ్యప్ప దీక్షలో ఉన్న ఎ మ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి గురువారం ఉదయం పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పూజారి వాసుదేవరావు ఎమ్మెల్యేకు, భక్తులకు తీర్థప్రసాదాలు వితరణచేశారు. కార్యక్రమంలో గురుస్వాములు శ్రీనివాస్‌గౌడ్, కృష్ణమానాయు డు, చిన్నరాజు, మధురెడ్డి, రాజేశ్, అయ్యప్ప స్వాములు, నాయకులు పాల్గొన్నారు.