నాగర్ కర్నూల్ : హిందూ దేవుళ్లు శ్రీ సీతారామలక్ష్మణులపై సినీ యాక్టర్ ప్రకాష్‌రాజ్ ( Actor Prakash Raj ) చేసిన అనుచిత వ్యాఖ్యలపై నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్లో హిందూ సామాజిక సంస్థల ప్రతినిధులు ఆదివారం ఫిర్యాదు చేశారు ( Complaint ) . ఈ మేరకు స్టేషన్ హౌజ్ ఆఫీసర్ గోవర్దన్‌కు ఓ వినతి పత్రం అందజేశారు.
ఈసందర్భంగా సీనియర్ నాయకులు బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ హిందూ వ్యతిరేక ఉన్మాదిలా ప్రవర్థిస్తున్నాడని, అదేపనిగా హిందూ ఆరాధ్య దేవుళ్లపై విమర్శలు చేస్తున్నాడని తీవ్రంగా ఆరోపించారు. భారతదేశాన్ని ఉత్తర దక్షిణ ప్రాంతాలుగా విడదీసే కుట్రపూరిత వ్యాఖ్యలు చేస్తు కోటానుకోట్ల రామభక్తుల మనోభావాలను, విశ్వాసాలను కించ పరుస్తున్నాడని విమర్శించారు.
హిందువుల సహనశీలత , ఓపికలను బలహీనతలుగా భావించి బరితెగించి మాట్లాడుతున్న హిందూవ్యతిరేక ఉన్మాదిని వెంటనే అరెస్ట్ చేసి చట్టరీత్య కఠినంగా శిక్షించాలి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐక్య వేదిక నాయకులు బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి, పిడికిళ్లజంగయ్య, జింకల గణేష్, పాలమూర్ శివ, విశ్వహిందూపరిషత్ జిల్లా అధ్యక్షులు శివయ్యగౌడ్, నాయకులు నర్సంహగౌడ్, బీజేపీ టౌన్ అధ్యక్షులు చెవ్వ ప్రమోద్ కుమార్, టౌన్ జనరల్ సెక్రటరీ అడ్వకేట్ జగదీశ్వర్ రెడ్డి, నాయకులు ఎ.రాజేశ్వర్ రెడ్డి, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.