గద్వాల టౌన్, ఆగ స్టు 24 : గద్వాల సంస్థానం పే రు చెబితేనే కళలు.. సాహిత్యం.. అపూ ర్వ కట్టడాలు.. రాజపాలన ఇట్టే గుర్తుకొస్తా యి. అంతటి చరిత్ర కలిగిన కట్టడాలు నేడు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. రాబోయే రోజుల్లో ఒకప్పుడు కళాఖండాలు ఉండేవని భవిష్యత్ తరాలు చర్చించుకునే దుస్థితి దాపురించనున్నది. గద్వాల సంస్థానాధీశుల కాలంలో నిర్మించిన రాజదర్బార్‌ను కళాశాలకు అప్పగించిన తర్వాత ల్యాబ్‌కు అనుకూలంగా మార్చారు.
కొన్ని సంవత్సరాలపాటు ఎందరో విద్యార్థులు దర్బార్ నీడన ప్రయోగాలతో చదువుకొన్నారు. ప్రస్తుతం కళాశాల అధికారులు దర్బార్‌ను స్టోర్ రూంగా మార్చేశారు. దీంతో భవనం శిథిలావస్థకు చేరింది. రాజులు, సంస్థానాల గొప్పతనాన్ని చాటిచెప్పే కట్టడాలను గాలికొదిలేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం మరమ్మతులు చేపట్టి నాటి జ్ఞాపకాలను పదిలంగా కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.