గట్టు, జూలై 20 : స్థానిక ప్రభుత్వ కళాశాలలో బోధనా సిబ్బందితోపాటు అవసరమయ్యే అన్ని వసతులు కల్పించాలని కోరుతూ కళాశాల విద్యార్థులు హైకోర్టు సీజేకు పోస్ట్‌కార్డులు పంపారు.
ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ బోధనా సిబ్బంది లేకపోవడంతో తీవ్ర ఇక్కట్లు పడుతూ సిలబస్ ముం దుకు సాగడంలేదని వాపోయారు. కార్యక్రమంలో జూనియర్ కళాశాల బోధనా సిబ్బంది, ఎన్నారై కోఆర్డినేటర్ మహిపాల్‌రెడ్డి, ఎంవీఎఫ్ మండల ఇన్చార్జి కిరణ్‌కుమార్, మోబిలైజర్ వీణ పాల్గొన్నారు.