సువర్ణాక్షరాలతో లిఖించుకుందాం
అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ దేశానికి తెలంగాణ ఆభరణంగా నిలుస్తున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఈ రోజును చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకుందామన్నారు.
- దేశానికి ఆభరణంగా తెలంగాణ
- పాలకులుగా ఉద్యమ సారథులు..
- భారీగా పెరిగిన ఎంబీబీఎస్ సీట్లు
- విద్యార్థులు ప్రజలకు వైద్య కవచంగా ఉండాలి
- పారామెడికల్ పోస్టులను పెంచుకోవాలి
- ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు
వనపర్తి (నమస్తే తెలంగాణ)/నాగర్‌కర్నూల్, న వంబర్ 15 : అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ దేశానికి తెలంగాణ ఆభరణంగా నిలుస్తున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఈ రోజును చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకుందామన్నారు. వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో నూతనంగా నిర్మించిన మెడికల్ కళాశాలలను సీఎం కేసీఆర్ మంగళవారం హైదరాబాద్ నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించా రు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దే శంలో ఇప్పటివరకు ఎనిమిది మెడికల్ కళాశాలలను ఏకకాలంలో ప్రారంభించుకున్న చరిత్ర లేదన్నారు. తెలంగాణ ఉద్యమ సారథులు పాలకులుగా ఉండడంతోనే ఇది సాధ్యమైందన్నారు. వినూత్నమైన ఆలోచనలు, విధానాలతో దేశానికి మార్గదర్శిగా నిలుస్తున్నామన్నారు. వచ్చే ఏడాదిలో మరో 15 కళాశాలలు ప్రారంభించుకుందామన్నారు.
నూతన మెడికల్ కళాశాలలతో 850 నుంచి 2,790 ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయన్నారు. పీజీ సీట్లు 515 నుంచి 1180, సూపర్ స్పెషాలిటీ సీట్లు 70 నుంచి 152కు పెరిగాయని తెలిపారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాలల విద్యార్థులు చదువులో రాణించి ఎంబీబీఎస్ సీట్లకు ఎంపికవుతున్నారన్నారు. వైద్యరంగాన్ని పటిష్టపరిచేందుకు వైద్యులతోపాటు సమాంతరంగా పారా మెడికల్ పోస్టులైన నర్సులు, లాబ్ టెక్నీషియన్స్, మెడికల్ సిబ్బందిని పెంచుకోవాల్సిన అవసరముందన్నారు. ఇందుకుగా నూ నర్సింగ్ కళాశాలను నిర్మించాలని నిర్ణయించిన ట్లు వెల్లడించారు. మెడికల్ కళాశాలల్లో చదివే విద్యార్థులు తెలంగాణ ప్రజలకు రక్షణగా ఉండేలా వైద్య కవచాన్ని నిర్మించాలన్నారు. పేదల పరిరక్షణకు రూ.వేల కోట్లు ఖర్చు పెడుతున్నట్లు తెలిపారు. ఉన్నతాధికారులు సమీక్షలు నిర్వహించుకోవాలన్నారు. వనపర్తి లో జరిగిన కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, కలెక్టర్ షేక్‌యాస్మిన్ బాషా, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ ల క్ష్మయ్య, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీధర్, ఎంపీపీ కిచ్చారెడ్డి, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ సునందిని, సూపరింటెండెంట్ నరేంద్రకుమార్, గొర్రెల కాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు కు రుమూర్తి యాదవ్ పాల్గొన్నారు. నాగర్‌కర్నూల్‌లో ఎ మ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, కలెక్టర్ ఉదయ్‌కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి కశాశాలను ప్రారంభించారు. అ నంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మనూచౌదరి, డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కల్పన, కళాశాల ప్రిన్సిపాల్ రమాదేవి, సూపరింటెండెంట్ రఘు, ఆర్అండ్బీ ఈఈ భాస్కర్, కౌన్సిలర్లు, జిల్లా అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

