నాగర్‌కర్నూల్, జూలై 12 : ఇహపర సాధనకు చండీహోమం ఉత్తమమైనదని, చండీ అమ్మవారి దయ లోకమంతా ఉండాలని, అమ్మవారి దయ ఉంటే అన్ని ఉన్నట్లేనని శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానందస్వామీజీ అన్నారు. నాగర్‌కర్నూల్‌లోని ఓంనగర్ కాలనీలో నిర్వహిస్తున్న చం డీయాగ మహోత్సవ వేడుకలు ఆరో రోజూ కొనసాగాయి. శుక్రవారం 225 మంది దంపతులతో చండీహోమాలు, 400 మంది మహిళలతో సామూహిక కుంకుమార్చనలు, 22 మంది దంపతులతో పుత్రకామేష్టి యాగం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ చండీ సప్తశతిని సామూహిక హోమాల్లో భాగంగా 225 మంది దంపతులతో చండీహోమం నిర్వహించామన్నారు. చండీహోమంలోని సప్తశక్తి యొక్క అంతరార్ధాన్ని ఎంతో చక్క గా వివరించి హోమం ఎలా చేసుకుంటే సంపూర్ణ ఫలితం ఉంటుందనే విషయాన్ని భక్తులకు తెలిపి వారి చేత చండీ హోమాలని ఆచరింపజేశారు.
మార్కండేయ పురాణంలో చండీహోమ విశిష్టతను తెలిపారని, 13 అధ్యాయాలు, 700 శ్లోకాలతో హోమం నిర్వహిస్తారన్నారు. అయితే దేశోపద్రవాలు శాంతించడానికి, గ్రహాల అనుకూలతకు, భయభీతులు పోవడానికి, శత్రు సంహారానికి, శత్రువులపై విజయం సాధించడానికి తదితర కారణాలతో ఆయుత చండీ, అతిరుద్ర యాగాన్ని పురస్కరించుకొని హోమాలను నిర్వహించారు. శనివారం ఉదయం సుదర్శన, పాశుపద, నవగ్రహ, లక్ష్మీనారాయణ హోమాలు, పుత్ర కామే ష్టి హోమాలు, సాయంత్రం 6 గంటలకు లోక కల్యాణుడు శ్రీభూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వారి కల్యాణాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పా ల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందాలన్నారు.