అమరచింత : ఆత్మకూరు పట్టణానికి చెందిన ప్రముఖ కాలిగ్రఫీ ఆర్టిస్ట్(Calligraphy artist ) కట్టలేమండి నవకాంత్కు హైదరాబాద్ మానస ఆర్టిస్టు థియేటర్ ఉగాది పురస్కారంతో (Ugadi award) సన్మానించింది. హైదరాబాదులోని త్యాగరాయ గాన సభలో జరిగిన కార్యక్రమంలో ఉగాది పురస్కారంతో పాటు పూలమాల, శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన ఆత్మకూరులో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ వివిధ సామాజిక, కళా రంగాల్లో విశేషంగా కృషి చేసిన వారికి అవార్డును నిర్వాహకులు అందజేస్తారని అవార్డు గ్రహిత నవకాంత్ తెలిపారు. అవార్డు గ్రహితను పలువురు రాజకీయ పార్టీల నాయకులు, పట్టణ ప్రముఖులు కలిసి అభినందించారు.