నాగర్ కర్నూల్ : ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులపై అధికార పార్టీ నాయకులు ప్రతికారాన్ని తీర్చుకుంటున్నారు. జిల్లాలోని మాజీ జడ్పీటీసీ శ్రీశైలం ( Srisailam )ను సంబంధ లేని కేసులో ఇరికించి అతడి ఇంటిపై పోలీసులు దాడి చేసి అరెస్టు ( BRS Leader Arrest ) చేసి రిమాండ్కు తరలించారు. అతడిపై హత్యనేరం ( Murder Case ) సెక్షన్ కింద కేసు నమోదు చేయడం తీవ్ర చర్చనీ యశంగా మారింది.
గత కొన్నాళ్లుగా కాంగ్రెస్ నేతల ఆగడాలను శ్రీశైలం ఎండగడుతున్నారు. ఇది జీర్ణించుకోలేని కాంగ్రెస్ నేతలు ఆయన స్వగ్రామంలో జరిగిన చిన్న ఘటనపై హడా విడిగా కేసులు నమోదు చేశారు. ఆదివారం సాయంత్రం పొలం వద్ద ఇద్దరి వ్యక్తుల మ ధ్య జరిగిన వాగ్వాదంలో వారిని విడిపించడానికి వెళ్లిన శ్రీశైలంపై ఉల్టా కేసు నమోదు చేశారు.
ఎమ్మెల్యే అండదండలతో పోలీసులు అర్ధరాత్రి అదుపులోకి తీసుకొని మెజిస్ట్రేట్ ముందు హాజరపరిచి జైలుకు పంపారు. ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ నేతపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జైల్లో ఉన్న శ్రీశైలంను కలసి ధైర్యం చెప్పారు.