మళ్లీ అధికారంలోకి వస్తాం
రాబోయే కాలంలో తెలంగాణలో బీఆర్ఎస్ మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.
- మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
దేవరకద్ర, జూలై 4 : రాబోయే కాలంలో తెలంగాణలో బీఆర్ఎస్ మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం దేవరకద్ర మండల ము ఖ్యనాయకులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సారథ్యంలో 14 ఏండ్లపాటు ఉద్యమాలు చేసి ప్రత్యేక రా ష్ర్టాన్ని సాధించి పదేండ్ల కాలంలో తె లంగాణను స్వర్ణయుగంగా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి ఉన్నప్పుడు గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించామని, కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన త ర్వాత పాలనను గాలికి వదిలి సీఎం ఢిల్లీ ప ర్యటనకే పరిమి తమ య్యారని ఎద్దేవా చేశారు.
రైతులకు పెట్టుబడి సాయం, 24 గంటల కరెంట్, రైతుంబంధు పంపిణీ చేయకుండా సమావేశాల పేరిట కాలయాపన చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముం దు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తప్పుదోవపట్టిస్తున్నదని, ఆరు గ్యారెంటీలనూ సక్రమంగా అమలు చేయకుండా దరఖాస్తుల పేరుతో కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్లు పెంచి ఇవ్వాలని, మహిళలకు రూ.2,500 భృతితోపాటు ఆరు గ్యారెంటీలను అ మలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సహకార సం ఘం అధ్యక్షుడు డోకూర్ నరేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జెట్టి నర్సింహారెడ్డి, నాయకులు శ్రీకాంత్‌యాదవ్, వెంకటేశ్, భాస్కర్‌రెడ్డి, చల్మారెడ్డి, కొండారెడ్డి, దొబ్బలి ఆంజనేయులు, గోపాల్, శ్యాంసుందర్‌రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

