వనపర్తి, జూలై 23 : భవిష్యత్‌లో వనపర్తిని రాష్ట్రంలో అగ్రభాగాన నిలుపుతామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో 20మంది జమ్మిచెట్టు ఆటో యూనియ న్ సభ్యులు బీఆర్ఎస్ నాయకుడు కొమ్ము శ్రీను ఆధ్వర్యంలో ఆదివారం మంత్రి నిరంజన్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్ని వర్గాల దరికి చేరుతున్నాయన్నారు. రాష్ట్రంలో, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు, ఇతర పార్టీల నాయకులు స్వచ్ఛందంగా గులాబీ గూటికి చే రుతున్నారన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే ఎన్నో అభివృద్ధి పనులను చేసి ప్రజల కండ్ల ముందర పెట్టామని, భవిష్యత్‌లో చేయాల్సిన పనులకు సంబంధించిన ప్రణాళికలను తయారు చేస్తున్నామని వివరించారు.
రైతు సంక్షేమం కోరే ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్
వనపర్తి రూరల్, జూలై 23 : దేశంలోనే రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణానని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం వనపర్తి మండలకేంద్రంలోని శ్రీనివాసపురం లో అనారోగ్యంతో మృతి చెందిన రైతు రాములు కుటుంబానికి మంజూరైన రూ.5లక్షల రైతు బీమా ప్రొసీడింగ్‌ను మంత్రి స్వయంగా ఇంటికి వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మట్టిని నమ్ముకొని ప్రపంచానికి అన్నం పెడుతున్న రైతు కుటుంబానికి ఆపత్కాలంలో అండగా నిలవాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచనన్నారు. అన్నదా త కుటుంబాలకు అండగా నిలబడాలన్న ఆలోచనతో రైతు బీమా పథకాన్ని తీసుకొచ్చి ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి పథకాన్ని వర్తింప చేస్తుందన్నా రు. రాష్ట్రంలో ఇప్పటికే లక్షా 5వేల రైతు కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం అందజేశామన్నారు.
బీఆర్ఎస్ కార్యకర్తకు పరామర్శ
మండలంలోని చందాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త చిన్న రాము లు అనారోగ్యానికి గురికాగా విషయం తెలుసుకున్న మంత్రి స్వయంగా ఇంటికి వెళ్లి పరామర్శించారు. పార్టీ పరంగానే కాకుండా తాను కూడా కార్యకర్తలకు తోడుగా నిలుస్తానన్నారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, రాష్ట్ర సహకార యూనియన్ సభ్యుడు తిరుమల మహేశ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, రైతు బంధు సమితి మం డల అధ్యక్షుడు నర్సింహ, పట్టణ మహి ళా నాయకురాలు మధులత, నాయకు లు తిరుమల వెంకటేశ్, ఉస్మాన్, రమేశ్, చందాపూర్ సర్పంచ్ చెన్నారెడ్డి, మురళీసాగర్ బీఆర్ఎస్ నాయకులు తదిత రులు పాల్గొన్నారు.