కార్య సాధకుడు కేసీఆర్ : ఎమ్మెల్యే విజయుడు
తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించేందుకు కేసీఆర్ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దీక్షా దివస్‌తో చరిత్రను మలుపుతప్పారని, కార్య సాధకుడని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి విజయుడుతోపాటు బాసు హనుమంతు, బీఎస్ కేశవ్, నాగర్‌దొడ్డి వెంకట్రాములు, ఆంజనేయులుగౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
- కేసీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి : సాట్ మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్
గద్వాల/టౌన్, నవంబర్ 29 : తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించేందుకు కేసీఆర్ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దీక్షా దివస్‌తో చరిత్రను మలుపుతప్పారని, కార్య సాధకుడని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి విజయుడుతోపాటు బాసు హనుమంతు, బీఎస్ కేశవ్, నాగర్‌దొడ్డి వెంకట్రాములు, ఆంజనేయులుగౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్ దీక్ష చరిత్ర సృష్టించిందన్నారు.
ఎవరెన్ని కుట్రలు చేసినా చరిత్రను, ప్రజల గుండెల్లో కేసీఆర్ స్థానాన్ని చెరపలేరన్నారు. ఆంజనేయగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్‌కు భారతరత్న ఇవ్వాల్సిందేనన్నారు. సర్పంచ్ పదవులను అంగట్లో సరకులా అమ్ముతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. నాగర్‌దొడ్డి వెంకట్రాములు మాట్లాడుతూ కేసీఆర్ కార్యసాధకుడని అభివర్ణించారు. ఉద్యమంలో ఏనాడూ పాల్గొనని, తెలంగాణ పోరాటం చేయని కొందరు మూర్ఖుల మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. అంతకుముందు మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు చేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు చేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మోనేశ్, రామకృష్ణ, కోటేశ్, సుధాకర్‌రెడ్డి, యువకిశోర్, బసవరాజు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. 4 రోజుల్లోనే రూ.500 కోట్లకు చేరువలో వసూళ్లు!
Sarojini Devi Eye Hospital | దీపావళి ఎఫెక్ట్.. సరోజిని దవాఖానకు క్యూకట్టిన బాధితులు
Nvidia CEO Jensen Huang: ఎన్విడియా సీఈవో జేన్సన్పై దర్యాప్తు.. షాక్‌లో టెకీ ప్రపంచం
Fire accidents | పండుగ పూట హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు..! భయాందోళనలో జనం : వీడియో
Ramayana | ‘రామాయణ’ కంటే ‘ఆదిపురుష్’ విజువల్స్ బెటరా.. గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ సినిమాకే ఎక్కువ మార్కులు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

