బిజినపల్లి : అగ్రికల్చర్ విద్యార్థులు (Agricultural students ) గ్రామీణ స్థాయిలో రైతులతో మమయకమై క్షేత్రస్థాయిలో పనిచేయాలని విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ శ్రీదేవి( Sridevi ) అన్నారు. బుధవారం మండలంలోని పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో వ్యవసాయ విద్యార్థులకు గ్రామీణ వ్యవసాయ అనుభవ కార్యక్రమం పై అవగహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేవీకే ఆధ్వర్యంలో 4 నెలల పాటు విద్యార్థులు తమకు కేటాయించిన గ్రామాలకు రైతులతో వారి అనుభవాలు నేర్చుకోవడంతో పాటు మూడెండ్ల పాటు చదివిన మీ అనుభవాలను సైతం రైతులకు వివరించాలన్నారు. వ్యవసాయ కళాశాల చివరి సంవత్సరం పాలెం వ్యవసాయ కళాశాల నుంచి 38 మంది, వనపర్తి వ్యవసాయ కళాశాల నుంచి 27 మందిని వ్యవసాయ అనుభవ కార్యక్రమానికి సంబంధించిన విషయాలను తెలుసుకోవడంతో పాటు రైతులకు తెలియజేయాలన్నారు.
జిల్లాలోని తాడూర్, బిజినేపల్లి మండలం చేగుంట, ఖానాపూర్, ఆవంచ,రాంరెడ్డిపల్లి, యత్మతాపూర్, తూమ్మలసుగూర్, గోరిట, ఇంద్రకల్, మంగనూర్ గ్రామాలకు విద్యార్థులకు కేటాయించామన్నారు. కార్యక్రములో శాస్త్రవేత్తలు రాజశేఖర్, శైల విద్యార్థులు పాల్గొన్నారు.