శ్రావణం.. శుభప్రదం
శ్రావణం.. ఆధ్యాత్మిక మాసం.. భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్లో శ్రావణ మాసానికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది. అందుకే ఈ మాసాన్ని శుభాలు, పండుగల మాసం అని అంటారు. ఈ నెలలో అన్ని రోజులూ శుభకరమే.. నాగుల పంచమి, వరలక్ష్మీ వ్రతం, రాఖీ పౌర్ణమి, హయగ్రీవ జయంతి వంటి ఎన్నో విశిష్టమైన పండుగలు రానున్నాయి.
- నేటి నుంచి అధిక శ్రావణమాసం షురూ
బాలానగర్, జూలై 18: శ్రావణం.. ఆధ్యాత్మిక మాసం.. భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్లో శ్రావణ మాసానికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది. అందుకే ఈ మాసాన్ని శుభాలు, పండుగల మాసం అని అంటారు. ఈ నెలలో అన్ని రోజులూ శుభకరమే.. నాగుల పంచమి, వరలక్ష్మీ వ్రతం, రాఖీ పౌర్ణమి, హయగ్రీవ జయంతి వంటి ఎన్నో విశిష్టమైన పండుగలు రానున్నాయి. ఈ మాసమంతా ప్రతి ఇల్లూ నిత్య పూజలతో అలరారుతుంది. ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోతాయి. కాగా ఈ సోమవారం నుంచి అధిక శ్రావణం, ఆగస్టు 17 నుంచి నిజ శ్రావణం ప్రారంభమవుతుంది. నిజ శ్రావణంలోనే పండుగలు, పూజాధికాలు నిర్వహిస్తుంటారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలతో సందడిగా మారుతుంది. ఈ ఏటా అధిక మాసం రావడంతో కృష్ణాష్టమి, పోలాల అమావాస్య పండుగలు సెప్టెంబర్‌లో రానున్నాయి. శివుడికి అ్యతంత ప్రీతిపాత్రమైన మాసం శ్రావణ మాసం. శ్రీనివాసుడి జన్మ నక్షత్రం కూడా శ్రావణమే. శ్రీకృష్ణుడు అవతరించింది కూడా ఈ మాసంలోనే. బలిచక్రవర్తికి పట్టాభిషేకం జరిగిందీ ఈ మాసంలోనే. శ్రవణ నక్షత్రానికి అధిపతి శివుడు ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును పూజిస్తాడని ప్రతీతి.

శ్రావణ మాసం ప్రత్యేకతలు, నియమాలు
సోమవారం : ముక్తి ప్రదాత ముక్కంటికి ప్రీతికరమైనది. ఈ రోజున స్వామిని పూజిస్తే కటాక్షం పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. లింగస్వరూపుడైన శివుడికి అభిషేకం, అర్చనతో కొలిస్తే శుభం కలిగి పాపాలు తొలగుతాయి.
మంగళవారం : అభయమిచ్చే హనుమంతుడు.. సకల విఘ్నాలను తొలగించి సకల దేవతల కంటే ముందే మొదటి పూజలందుకునే విఘ్నేశ్వరుడు. సంతాన భాగ్యాన్ని కలిగించే సుబ్రహ్మణ్యేశ్వరుడు మంగళవారం నాడే జన్మించారని పురాణాలు చెబుతున్నాయి. మంగళగౌరికి ఎంతో ప్రీతికరమైన రోజు. భక్తి శ్రద్ధలతో పూజిస్తే శుభాలను ప్రసాదిస్తారని భక్తుల విశ్వాసం.
బుధ, గురువారం : అయ్యప్పకు ప్రీతికరమైన రోజు. గురువారం రాఘవేంద్రస్వామి, దక్షణామూర్తి, సాయిబాబాకు ప్రీతికరమైన రోజులుగా పరగణిస్తారు.
శుక్రవారం : శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం ఎంతో ప్రాధాన్యమైంది. అమ్మవారి కటాక్షాలు లభిస్తాయని భక్తుల నమ్మకం.
శనివారం : కలియుగ దైవం శ్రీనివాసుడికి ప్రీతికరమైన రోజు. ఈ రోజు ఉపవాస దీక్ష చేపడతారు. స్వామికి పుష్పార్చనలు చేస్తారు.

ఈ మాసంలో వచ్చే పండుగలు..
మంగళగౌరీ వ్రతం: ప్రతి మంగళ, శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ముత్తైదువలు, యువతులు ఆచరించే మంగళగౌరీ వ్రతం అత్యంత విశేషమైంది. అమ్మవారిని షోడశోపచారాలు, అష్టోత్తర శతనామాలతో పూజిస్తారు. చివరి వారంలో పసుపు కుంకుమలతో వాయినాలు సమర్పించుకుంటారు.
నాగుల పంచమి : శ్రావణ శుద్ధ చవితి, పంచమి రోజున నాగుల చవితి, పంచమిని జరుపుకొంటారు.
వరలక్ష్మీ వ్రతం: నిత్య సౌభాగ్యం కోసం మహిళలు ఆచరించే వ్రతాల్లో వరలక్ష్మీ వ్రతం ఒకటి. శ్రావణంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.
శ్రావణ పూర్ణిమ : శ్రావణంలో వచ్చే పూర్ణిమనే శ్రావణ పూర్ణిమ అంటారు. రక్షాబంధన్, జంద్యాల పౌర్ణమిగా జరుపుకొంటారు. ఇదే రోజున హయగ్రీవ, సంతోషిమాత జయంతి కూడా కావడం విశేషం.
శ్రీకృష్ణాష్టమి : శ్రావణ కృష్ణపక్ష అష్టమి రోజున కృష్ణుడి జన్మాష్టమిగా జరుపుకొంటారు. కృష్ణాష్టమి వ్రతాన్ని నిష్టతో ఆచరిస్తే సంవత్సరంలో 24 ఏకదాశి వ్రతాలు చేసిన పుణ్యఫలం అభిస్తుందని పండితులు చెబుతున్నారు.
మహావిష్ణువుకు ప్రీతికరమైన మాసం
శ్రావణం మాసం మహావిష్ణువు, ఆయన సతీమణి మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన మాసంగా పురాణాలు చెబుతున్నాయి. ఈ మా సంలో చేసే దైవ కార్యాల కు ఎంతో శక్తి ఉంటుంది. సోమవారం (17వ తేదీ) నుం చి అధిక శ్రావణ మాసం ప్రారం భం అవుతుంది. వచ్చే నెల 17 నుంచి నిజ శ్రావణం మొదలవుతుండగా, అదే నెలలో పండుగలు, దైవారాధన చేస్తుంటారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | భవానీ భక్తులతో వెళ్తున్న బొలెరో బోల్తా.. ఇద్దరు దుర్మరణం
No Relief For CJP | అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లకు.. కస్టడీని పొడిగించిన కోర్టు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

