కందనూలు, ఏప్రిల్ 21: గర్భిణులకు అందజేస్తున్న న్యూట్రీషన్ కిట్ల అమలు తీరుపై శుక్రవారం రాష్ట్ర బృందం పర్యటించింది. వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు నాగర్‌కర్నూల్ జిల్లాలోని పెద్దముద్దునూర్ పీహెచ్‌సీని బృందం తనిఖీ చేసింది. ఈ సందర్భంగా కిట్ వినియోగంపై గర్భిణుల అభిప్రాయాలను తెలుసుకున్నారు.
వారి వెంట డీఎంహెచ్‌వో సుధాకర్లాల్, జిల్లా ప్రోగ్రాం అసిస్టెంట్ కృష్ణమోహన్, డీపీవో రేణయ్య, డీడీఎం సందీప్, అసిస్టెంట్ ప్రోగ్రాం ఆఫీసర్ నిరంజన్, వైద్యుడు నారాయణస్వామి, సూపర్వైజర్ కేశవులు, రజిత, సిస్టర్ భాగ్యలక్ష్మి, ల్యాబ్ టెక్నీషియన్ ప్రభాకర్‌రెడ్డి, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, గర్భిణులు, బాలింతలున్నారు.