అలంపూర్,డిసెంబర్ 14 : అలంపూర్ నియోజకవర్గంలో ఏర్పాటుచేసిన ఫైర్‌స్టేషన్ సమస్యల వలయంలో చిక్కుకున్నది. అక్కడ విధులు నిర్వర్తించలేమని సి బ్బంది పడుతున్న గోస వర్ణనాతీతం. గతంలో కేసీఆర్ హయాంలో అగ్ని ప్రమాదాల తక్షణ నివారణ కో సం అన్ని గ్రామాలకు అందుబాటులో ఉండే విధంగా నియోజకవర్గానికో ఫైర్‌స్టేషన్ ఏర్పాటు చేసింది. గతేడా ది అక్టోబర్ 6వ తేదీన అలంపూర్ చౌరస్తా వ్యవసాయ మార్కెట్ యార్డులో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు తాత్కాలికంగా ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. ప్రభుత్వం మారినా పరిస్థితులు మారలేదు. స్టేషన్ హౌస్ ఇన్చార్జి కురుమూర్తితో పాటు 13మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు.
వారిలో ఇద్దరు డిప్యుటేషన్లో ఉన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఫైర్ ఇంజిన్‌లో నీటిని నింపుకోవడానికి కూడా అవకాశం లేకపోగా కనీసం సిబ్బంది కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా తగిన నీటి సౌకర్యం లేదు. మరుగుదొడ్లు లేక సిబ్బంది మార్కెట్ యార్డులోని ముళ్ల పొదల్లోకి వెళ్లే పరిస్థితి దాపురించింది. అదేవిధంగా కాలం చెల్లిన ఫైర్ ఇంజిన్‌కు మరమ్మతులు నోచుకోక సిబ్బంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఫైర్ ఇంజిన్‌లో నీ టిని నింపుకోవడానికి కూడా నేషనల్ హైవే-44 వారి బోర్లపై ఆధారపడాల్సిన దుస్థ్థితి ఏర్పడింది. వ్య వసాయ మార్కెట్లో ఓహెచ్‌ఆర్ ట్యాంక్ ఉన్నప్పటికీ ఫైర్ ఇంజిన్‌కు నీటిని నింపుకొనే సౌకర్యం లేదు.
సిబ్బందికి విధులు నిర్వర్తించడానికి సరైన కార్యాలయం లే దు. వ్యాపార సముదాయంలోని ఓపెన్ షెట్టర్లలోనే చలికి కాలం వెల్లదీస్తున్నారు. వర్క్ లేనప్పడు సిబ్బంది విశాంత్రి తీసుకోవడానికి తగిన ఫర్నీచర్ ,బెడ్లు లేవు. కనీసం కంప్యూటర్ పెట్టుకోవడానికి టేబుల్ కూడా కరువైంది. ఫైర్ స్టే షన్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వర కు దాదాపుగా 43అగ్ని ప్రమాదాలను అరికట్టామని స్టేషన్ ఇన్చార్జి కురుమూర్తి తెలిపారు. స్టేషన్‌ను లో పరిస్థితులను గమనించి పరిష్కరించాలని కోరుతున్నారు. లేకపోతే అ లంపూర్ చౌరస్తాలో గత బీఆర్ఎస్ ప్ర భుత్వ హయాం లో కేటాయించిన 30 గుంటల భూమిలో కొత్త ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కో రుతున్నారు.