జడ్చర్ల, మే 14 : జడ్చర్ల మండలం గంగాపూర్ శివారులోని పత్తి మార్కెట్‌యార్డులో ప్రజాపంపిణీకి సంబంధించిన (ఎంఎల్ఎస్ స్టాక్ పాయింట్)గోదాంలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. గోదాంలో ఒక్కసారిగా మంటలు పెద్దఎత్తున ఎగిసిపడడంతో అందులో నిల్వ ఉన్న దాదాపు 800 క్వింటాళ్ల బియ్యంతోపాటు 75వేల గన్నీ బ్యాగులు అగ్నికి ఆహుతయ్యాయి. కాగా దాదాపు రూ.40లక్షల నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉదయం 11 గంటలకు స్టాక్ పాయింట్ గోదాంలో మంటలతోపాటు పొగ లు రావడాన్ని అక్కడే ధాన్యం ఆరబోసుకున్న రైతులు గమనించి మార్కెట్‌కమిటీ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డికి ఫోన్లో సమాచారమిచ్చారు. స్పందించిన చైర్మన్ వెంటనే పీఏసీసీఎస్ సీఈవో కు విషయం చెప్పగా అతనొచ్చి మంటలను గమనించి సివిల్‌సైప్లె అధికారులకు, ఫైర్‌స్టేషన్‌కు సమాచామిచ్చాడు. హు టాహుటిన రెండు ఫైర్ఇంజన్లు వచ్చి మంటలను ఆర్పే ప్రయ త్నం చేయగా మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడడంతో లోపలి కి వెళ్లేందుకు వీలులేకపోయింది. దీంతో అధికారుల సూచన మేరకు గోదాం గోడలను జేసీబీతో పగులగొట్టి మంటలను ఆ ర్పే ప్రయత్నం చేశారు. దాదాపు ఐదుగంటలపాటు ఫైర్ సి బ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
గోదాంలో అధికారులు సీ జ్ చేసిన 678క్వింటాళ్ల బియ్యంతోపాటు 60 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం కాలిపోయాయి. అదేవిధంగా 75వేల గన్నీ బ్యా గులు కాలిపోయాయి. అందులో 68వేల పాత సంచులు ఉండగా 3వేల కొత్త బస్తా లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. విష యం తెలుసుకున్న అదనపు కలెక్టర్ సీతారామరాజు, సివిల్‌సైప్లె డీఎం ప్రవీణ్ అక్కడికి చేరుకొని మంటలను పరిశీలించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను అధికారులతో అడిగి తెలుసుకున్నారు. కాగా బియ్యం, గన్నీ బ్యాగులతోపాటు గోదాంకు కూడా నష్టం వాటిళ్లింది. అగ్ని ప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్ లేదా గన్నీ బ్యాగులు తయారు చేసే సమయంలో వాడే యాసిడ్ కారణం అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భం గా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గోదాంలో స్టాక్ ఉన్న సీజ్డ్ రైస్‌తోపాటు రేషన్ బియ్యం కాలిపోయాయన్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. పత్తి మార్కెట్లో ఫైర్ సేఫ్టీ ఉంటే మంటలు త్వరగా అదుపులోకి వచ్చి.. ఇంతనష్టం జరిగేది కాదన్నారు. జిల్లాలోని మూడు పత్తి మార్కెట్లలో ఫైర్ సేఫ్టీ కోసం మార్కెటింగ్‌శాఖ, ఫైర్ అధికారులతో సోమవారం సమావేశం నిర్వహిస్తామన్నారు. జడ్చర్ల పత్తి మార్కెట్ నిర్మాణ సమయంలో ఫైర్ సేఫ్టీ కోసం డివైస్‌లు ఏర్పాటు చేసినా.. పూర్తిస్థాయిలో అందుకు సంబంధించిన పరికరాలను అమర్చలేదన్నారు. అ దనపు కలెక్టర్‌తోపాటు ఫైర్ అధికారి మల్లికార్జున్, డీటీలు కి శోర్, నాగార్జున తదితరులున్నారు.