ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం

- రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
- దళారులను నమ్మొద్దు
- ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభంలో ఎమ్మెల్యే చిట్టెం
మక్తల్ రూరల్ : రైతు పండించిన పంట ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని పంచదేవ్పహాడ్లో ప్రా థమిక వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రా న్ని జెడ్పీ చైర్పర్సన్ వనజ, డీసీసీబీ చైర్మన్ చిట్యాల నిజాంపాషాతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పారు. గతంలో పండిన పంట విక్రయించేందుకు రైతులు ఎన్నో కష్టాలు పడేవారని గుర్తు చేశారు. కానీ నేడు రైతు లకు దగ్గరగా ఉండేలా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వరి-ఏ గ్రేడ్‌కు రూ.1888, బీ-గేడ్కు రూ. 1866 మద్దతు ధరను ప్రభుత్వం చెల్లిస్తున్నదని తెలిపారు. కొందరు మధ్య దళారులు గ్రామాలకు వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తున్నారని, అలాంటి వారికి విక్రయించి మోసపోవద్దని సూచించారు. వ్యవసాయ రంగానికి సర్కారు పెద్దపీట వేసిందన్నారు. లాభసాటి వ్యవసాయంతో రైతులు లాభాలు పొందాలన్నారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ వనజ, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్‌గౌడ్, సర్పంచ్ కల్పనాకృష్ణ, దత్తు, ఎంపీటీసీ పారేవుల ఆశిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- శివగామి ఎత్తుకున్న చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూడండి!
- కాగ్‌లో 10,811 పోస్టులు
- ఈ నెల 31 వరకు ఎర్రకోట మూసివేత
- అజిత్ ముద్దుల తనయుడు పిక్స్ వైరల్
- పీఆర్సీ నివేదిక పూర్తి పాఠం
- రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు
- పట్టుకోలేరనుకున్నాడు..
- ఫ్లాట్లన్నీ విక్రయించాక.. అదనపు అంతస్థు ఎలా నిర్మిస్తారు
- రూ.15 వేల కోసం ప్రాణం తీశారు
- వెలుగులు పంచుతున్న గుట్టలు