ఈ వెలుగులే దేశానికంతా…!
మన పొద్దు మనకు పొడిచే దాకా రైతునూ రైతు కష్టాన్ని మింగిన పెద్ద కొండ చిలువ ఈ భూమే!
మన పొద్దు
మనకు పొడిచే దాకా
రైతునూ రైతు కష్టాన్ని మింగిన
పెద్ద కొండ చిలువ ఈ భూమే!
గుండె పగిలిన చెరువులు
వెక్కిరిస్తూ పరుగెత్తే కృష్ణా గోదావరీ నదులు
ఎడారిలోంచి ఎడారిలోకి ప్రవహించిన
దుర్మార్గపు కాలమది!
ఎవరు రాయలేదు చెప్పండి
ఆనాటి కన్నీటి భారతాన్ని?
ఊర్లకు ఊర్లు మనిషి జాడ కోసం
చూపులు ఇంటి దర్వాజలకు వేలాడదీసేవి!
పాలనా పగ్గాలు చేతికొచ్చాకే
దృశ్యాలన్నీ సశ్యశ్యామల తోరణాలైనవి
నదులు జింక పిల్లలై ఎగిరి గంతేసినవి
చెరువులు కుంటలు జల గీతాలైనవి!
అనతి కాలంలోనే
ఇక్కడి మట్టి బంగారమైంది
బంజరు పడావు భూములన్నీ
దేశానికి దాన్యాగారాలైనవి!
హ్రస్వ దృష్టి అనుయాయులు
భవిష్యత్తును కలగన లేరు
బురద చల్లే చేతులకు
పారిశుద్ధ్యం ఒంటబట్టదు!
వెలుగులు మొదలయ్యాక
చీకట్లన్నీ పాదాల కింద సర్దుకుంటాయి
పద పద దేశం ఆశగా ఎదురు చూస్తున్నది
ఇక్కడి వెలుగులు అంతటా పంచుదాం!!
– కోట్ల వెంకటేశ్వర రెడ్డి
9440233261.
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

