తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో, ఎంవీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2025, మార్చి 17వ తేదీ సోమవారం రోజున సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్లోని రవీంద్రభారతిలో సాహిత్య పురస్కారాల ప్రదాన సభ జరుగనున్నది.
మునిపల్లె రాజు శతజయంతి సందర్భంగా ఆయన పేరిట ఏటా ఇస్తున్న ‘కథాఋషి’ సాహిత్య పురస్కారం-2023కు గాను ప్రముఖ కవి, రచయిత, సాహితీవేత్త, సప్తపది లఘుకవితా ప్రక్రియ సృజనకర్త సుధామ, 2024కు గాను సుప్రసిద్ధ కథా, నవలా, సినీ రచయిత చంద్రశేఖర ఆజాద్ ఎంపికయ్యారు.
– డాక్టర్ ఉష మునిపల్లె