సిమెంటు అడవిలో నీటి ఆర్తనాదం
వానలు దండిగా కురుస్తున్నా మట్టి తల్లి గుండె మాత్రం తడవడం లేదు
వానలు దండిగా కురుస్తున్నా
మట్టి తల్లి గుండె మాత్రం తడవడం లేదు
ఆకాశం చిలికించిన జలధారలన్నీ
సిమెంటు పొరలపై జారిపడి
డ్రైనేజీల్లో దారి వెతుక్కుంటున్నాయి
చుక్క చుక్కగా కురిసిన నీరు
భూమి గర్భంలోకి చేరాల్సింది పోయి
కాలువల వెంట కన్నీళ్లలా పారిపోతోంది
ఒకప్పుడు వానచినుకును
ఆప్యాయంగా ఒడిలో దాచుకున్న నేల
ఇప్పుడు అపార్ట్మెంట్ల పాదాల కింద
ఊపిరాడక నలిగిపోతోంది
చెట్ల వేర్లను తాకాల్సిన నీరు
కాంక్రీటు గోడలనే తాకి
తన ప్రయాణాన్ని కోల్పోతోంది
బావులు నోళ్లు తెరిచి
ఆకాశాన్ని అడుగుతున్నాయి
మా దాహం తీరే చినుకెక్కడ?
బోర్లు లోతుల్లోకి దిగుతున్నా
నీటి జాడ దొరకడం లేదు
భూమి గుండెలో నిల్వ చేయాల్సిన నీటిని
మనమే పైపుల్లో పారబోసి
రేపటి దాహానికి విత్తనాలు వేస్తున్నాం
ఇది వర్షం రాకపోవడం కాదు
వచ్చిన వానను భూమికి అందించలేని
మనిషి నిర్లక్ష్యమే అసలైన కరువు!
ఈరోజు నేల దాహంతో పగిలితే
రేపు మన గొంతు నీటికై పగులుతుంది తస్మాత్ జాగ్రత్త
డా. కొరుప్రోలు , హరనాథ్
9703542598
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
Saluru | చైర్పర్సన్ పదవిపై ఆశ.. ఆగమేఘాల మీద ప్రేమ పెళ్లి! సాలూరులో టీడీపీ నేత ‘పొలిటికల్ మ్యారేజ్’ వైరల్!
Ekta Kapoor | గుడి నుంచి క్లబ్కు వెళ్తే షాకయ్యారు.. ఇండస్ట్రీలో హిందూ వ్యతిరేకతపై ఏక్తా కపూర్ కామెంట్స్!
Shikhar Dhawan: పర్మిషన్ లేకుండానే టోర్నీలో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ చట్టపరమైన చర్యలు
Jagtial | వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

