తల్లిగారిల్లు
నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు అన్నవారే రమ్మన్నారాను ప్రైవేటు ఆసుపత్రికి అంటున్నారు అమ్మమ్మ గారింట్లో పుట్టామని చెప్పేతరం పోయి సర్కారు దవాఖానాలో పుట్టామని చెప్పేరోజులివి
నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు అన్నవారే
రమ్మన్నారాను ప్రైవేటు ఆసుపత్రికి అంటున్నారు
అమ్మమ్మ గారింట్లో పుట్టామని చెప్పేతరం పోయి
సర్కారు దవాఖానాలో పుట్టామని చెప్పేరోజులివి
నెప్పి గోలి జ్వరంగోలి ఇచ్చి పంపే సర్కారు దవాఖానాలో
సిజేరియన్లు, డయాలసిస్ లు, మోకాలు మార్పిళ్ళు చేసే
పానం మీదకు వచ్చిందంటే హైదరాబాదు పరిగెత్తేది లేదు
వెంటిలేటర్లు సైతం ఊరి దవాఖానాలో ప్రత్యక్షమయ్యే
అమ్మమ్మ తాతల స్థానంలో ముఖ్యమంత్రి పేరురాసే
నొప్పులోచ్చినయ్యంటే 102 అగమాగంగా దూసుకొచ్చే
తెల్లకోటు తొడుక్కున్న ధరణిలో దేవతల ఎదురొచ్చే
శాస్త్ర చికిత్సకు సకల సౌకర్యాలూ ఆసుపత్రిలో సమకూర్చే
అమ్మ బడితో గర్భిణి స్త్రీని కంటికి రెప్పోలే కాపాడుతూ
డెలివరీకి తల్లిగారింటికి పోయినట్టు ఆసుపత్రికి పోయి
బడిలో బిడ్డతో చల్లంగా 102 వాహనంలో ఇంటికి చేరే
చేతిలో డబ్బుతో ఫ్రీ డెలివరీతో మొహం వెలుగుతో
అత్తారింటికి పంపుతూ చీరసాకిలు పెట్టే పుట్టింటోళ్ళు
బట్టలు సబ్బులు, దోమతెరలు పౌడర్లిచ్చే కే సీ యార్ కిట్టు
సారే పెట్టి సాగ నంపేను అడ బిడ్డ పాలిట తండ్రి లెక్క
పురుడు పోసి క్షేమంగా చేర్చెను తల్లి గారింటి లెక్క

Dr. Kandepi Raniprasad
– డా. కందేపి రాణీప్రసాద్.
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

