సీ॥ సంగీత సౌరభ సాహిత్య పవనమ్ము
ఈడుజోడు చెవుల జాడలడుగ
రాగతానమ్ములు రవళింప పల్లవి
త్యాగయ్య కృతికి కీర్తనము సేయు
దక్షిణ భారతి ద్రావిడ భాషలు
తెలుగు బాసకు తేనె లలుగులెత్త
సంగీత నామమ్ము సంకీర్ణ వర్ణాలు
కర్ణాటకంబుగా కళవళింప
తే.గీ.॥ తెలుగు తేనెల పల్కులన్ కలర వింప
మావి చివురులు మేసిన కోవిలమ్మ
పంచమస్వరాల్ వరహాలు పంచుచుండ
తెలుగు భారతి నొజ్జయై కులుకుచుండె॥
(నేడు గిడుగు రామ్మూర్తి జయంతి, తెలుగు భాషా దినోత్సవం)
-గొల్లపల్లి రఘురామ శర్మ
99891 49454