2024-దీపావళి పండుగను పురస్కరించుకొని ‘డాక్టర్ అమృతలత-పాలపిట్ట’ సంయుక్త ఆధ్వర్యంలో కథల పోటీని నిర్వహిస్తున్నాం. ఇతివృత్తం రచయితల అభీష్టం. సామాజిక కల్లోలాలే కాదు, మానవ అంతరంగాల్లోని ఘర్షణలనూ ఇతివృత్తాలుగా ఎంపిక చేసుకోవచ్చు. మొదటి బహుమతి-రూ.10 వేలు, రెండో బహుమతి: రూ.6 వేలు, మూడో బహుమతి: రూ.4 వేలు, మరో పది కథలను ప్రత్యేక బహుమతులుగా ఎంపికచేసి ఒక్కో కథకు రూ.1000 బహుమతిగా ఇవ్వనున్నాం.
కథల ఎంపిక లో ‘పాలపిట్ట’ సంపాదకవర్గానిదే తుది నిర్ణ యం. ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు తావులేదు. పోటీలో ఎంపికయ్యే కథలు ‘పాలపిట్ట’లో ప్రచురితమవుతాయి. కథలు పంపడానికి చివరి తేదీ 2024, సెప్టెంబర్ 25, ఫలితాలు ప్రకటించే తేదీ 2024, అక్టోబర్ 15. కథలు పంపవలసిన చిరునామా ఎడిట ర్ పాలపిట్ట, ప్లాట్ నెం-3, బ్లాక్-6, ఏపీహెచ్‌బీ, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్-044. ఫోన్:94900 99327, palapitta books @gmail.com
– గుడిపాటి, ఎడిటర్, పాలపిట్ట