సైన్స్‌ఫిక్షన్ కథలపోటీ ఫలితాలు
పత్తిపాక ఫౌండేషన్, గరిపెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన లీలావతి దవే బాలల ఫిక్షన్ కథల పో టీకి మంచి స్పందన వచ్చింది. పోటీలో ప్రథమ బహుమతి ఎస్ మేఘన, ద్వితీయ బహుమతి ఎన్ వజ్రకరణ్ (విజయ హైస్కూల్, నిజామాబాద్)లు ఎంపికయ్యారు. ప్రత్యేక బహుమతులకు షేక్ సమీ నా (తడపాకల్), భవ్యశ్రీ (మిర్యాలగూడ), బొమ్మె ర అనీల (దేవునిపల్లి), తరుణ్ (నిజామాబాద్), నవీన్ (గుండారం)లు ఎంపికయ్యారు. అలాగే విఠాల లలిత బాలల సైన్స్ ఫిక్షన్ నవలల పోటీలో రంగారెడ్డి జిల్లాకు చెందిన సయ్యద్ సలీం రాసిన మిషన్ ఎపిటీసీయా ఎంపికైంది.
– పత్తిపాక ఫౌండేషన్, గరిపెల్లి ట్రస్ట్
కవితల పోటీ ఫలితాలు
వసుంధర విజ్ఞాన వికాస మండలి నిర్వహించిన కర్కముత్తారెడ్డి స్మారక రెండు రాష్ర్టాల స్థాయి బాలల కవితల పోటీలు విజయవంతమయ్యాయి. పోటీలో జె వైష్ణవి (టీఎంఆర్ఎస్, బాలానగర్), చిన్మయి, (విజయవాడ), సి.హెచ్.సాయి (జెడ్పీహెచ్ఎస్, బొల్లారం), సీహెచ్ ప్రేరణ, అభిలాష్శర్మ (విజయ హైస్కూల్, నిజామాబాద్), సాయికీర్తన, (జెడ్పీహెచ్ ఎస్, ప్రకాశం జిల్లా), జె రమ్య (టీఎంఆర్ఎస్, బాలానగర్), కొలుపుల నందిని, (జెడ్పీహెచ్ఎస్, దుగ్గొండి), పృథ్వీ (జెడ్పీహెచ్ఎస్ లక్ష్మీపురం) విజే తలుగా నిలిచారు. విజేతలకు త్వరలో నగదు బహు మతులు అందజేస్తాం.
– వసుంధర విజ్ఞాన వికాస మండలి
పాలమూరు సాహితీ పురస్కారం
2022కు గాను ‘పాలమూరు సాహితీ అవార్డు’ కు కవితా సంపుటాలను ఆహ్వానిస్తున్నాం. దీనికోసం 2022లో ముద్రితమైన వచన కవితా సంపుటాలను మూడేసి ప్రతులను డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, ఇం.నెం-8-5-38, టీచర్స్ కాలనీ, మహబూబ్ నగర్-509001 చిరునామాకు జనవరి 31లోపు అందేలా పంపగలరు. ఎంపికైన కవితా సంపుటికి రూ.5,116 నగదుతో పాటు జాపికను అందజేస్తాం.
– భీంపల్లి శ్రీకాంత్, వ్యవస్థాపకులు,పాలమూరు సాహితీ పురస్కారం
ఉగాది బాలల కథల పోటీలు
ఉగాది పర్వదినం సందర్భంగా సుగుణ సాహితీ సమితి సిద్దిపేట జిల్లాలోని విద్యార్థుల నుంచి కథలను ఆహ్వానిస్తున్నాం. విజేతలకు ప్రథమ, ద్వితీ య, తృతీయ బహుమతులతో పాటు 10 ప్రత్యేక బహుమతులను అందజేస్తాం. హామీ పత్రంతో పాటు విద్యార్థులు తాము రాసిన కథలను కన్వీన ర్, ఉగాది కథల పోటీ, ప్రతిభ డిగ్రీ కళాశాల, మెదక్ రోడ్, సిద్దిపేట-502103 చిరునామాకు పంపాలి. 2023 జనవరి, 31చివరి తేదీ. పూర్తి వివరాలకు 99590 07914 నంబర్లో సంప్రదించగలరు.
-సుగుణ సాహితీ సమితి, సిద్దిపేట