పల్లవి: కలలుగన్న రాష్ట్రమచ్చెరా
కడుపునిండ తిండివెట్టెరా
ముప్పైమూడు జిల్లాలతో
తెలంగాణ ముచ్చటగా మురిసెరా
చరణం: అప్పుడు.. పెద్ద జిల్లాలతో
పరేషాండ్లతో సస్తిమిరా
ఆఫీసర్లు ఎప్పుడస్తరో ఎపుడువోతరో
ఎవ్వళ్ళకు తెలకవోతుండెరా
చరణం: ఇప్పుడు నాయకులు… ఆఫీసర్లు…
అర్సుకునేందుకు అచ్చుడే అచ్చుడే
పాత సుట్టపు సూపులు కానేకాదురా
అన్నిటికి నీవెంటేరా… నీతోనేరా…
చరణం: పనులన్నీ ఇపుడు సక్కగైనైరా
పొద్దున జిల్లాకేంద్రానికి పోతిమి
చిటుక్కున పని చేసుకొని
లటుక్కున ఇంటికస్తిమి
చరణం: ఇంటి దగ్గరికే పాలన
ఇదేదో కల కాదురా
ఉల్లెకం మాటలు అస్సలే గావురా
ఊరూరా అందరికి ఎరికేరా
చరణం: బంగారు తెలంగాణ
బగ్గ మంచిగనిపించి
అన్ని రాష్ర్టాల నుంచి
అచ్చినోల్లని కలుపుకొంటిమిరా
‘స్మాల్ ఈజ్ బ్యూటీఫుల్’ జిల్లాలతో
చరిత్రనే రాస్తిమిరా… మారిస్తిమిరా
– డాక్టర్ టి.సంపత్‌కుమార్, 98104 02895