పల్లవి: రేలారే రేలారే తెలంగాణ దేఖోరే
రేలారే రేలారే అభివృద్ధి భళారే
రేలారే రేలారే జనమంతా ఖుషీరే
రేలారే రేలారే భయమంతా పరారే /రేలారే/
చరణం : ఉద్యమనేతగా కేసీఆర్ కదిలెరే
ఉత్తమ నాయకునిగా కేసీఆర్ ఎదిగెరే
ఉజ్వల భవితకై ఉగ్రుడై సాగెరే
మహోజ్వల చరితకై మాన్యుడై నిలిచెరే
బంగరు తెలంగాణకై బాటలేవేసెరే
తెలంగాణ నేలకు కొత్త రూపునిచ్చెరే /రేలారే/
చరణం : మిషన్ కాకతీయతో చెరువులే తవ్వెరే
మిషన్ భగీరథతో మంచినీళ్ళే తెచ్చెరే
జల ప్రాజెక్టులతో జళకళనే ఇచ్చెరే
పాడి పంటలతో పుడమే పులకించెరే
ప్రగతి కాంతులతో తెలంగాణ వెలిగెరే
పల్లె పల్లెన ఆనందాలే విరిసెరే /రేలారే/
చరణం: హరితహారంతో ఆకుపచ్చ ఆయెరే
ఆరోగ్య రక్షణతో ఆనందమే కలిగెరే
రైతుబంధు పథకంతో రైతు మోము మురిసెరే
రైతుబీమా పథకంలో ప్రయోజనం చేకూర్చెరే
కల్యాణలక్ష్మితో కానుకలే ఇచ్చెరే
ఆసరా పింఛన్లతో అండగా నిలిచెరే /రేలారే/
చరణం: చదువుకున్న యువతకు ఉద్యోగం చూపెరే
విద్యా, వైద్యానికి ప్రాధాన్యం కల్పించెరే
చేతివృత్తిదారులకు చేయూతనిచ్చెరే
కార్మిక, కర్షకులకు బాటగా నిలిచెరే
ఐటీ, ఫార్మాలకు పెద్దపీట వేసెరే
విద్యుత్ వెలుగులను నిరంతరం పంచెరే
– రేళ్ళ శ్రీనివాస్, 73067 73666