సకల జనుల సౌహార్ధ బృంద గానం..
నా తెలంగాణం
సస్య శ్యామల హరిత వనం..
నవ తెలంగాణం
సమున్నత సంస్కృతీ
సాంప్రదాయాల సదనం
శ్రమ జీవన సౌందర్యపు
సజీవ చిహ్నం… నా తెలంగాణం
యువ తెలంగాణమా,
ఈ ఎనిమిదేండ్ల నీ గమనం
సమ సమాజ నిర్మాణానికి
దోవ చూపిన వైనం..
రైతుబంధు ప్రభుత కొలువు తీరగా
అన్నదాత కలలు నిజముగా మారగా
ఎత్తైన ఎత్తిపోతలు నిర్మితము కాగా
సాగునీళ్ళన్ని ఊళ్లకే ఉరికి వచ్చె
బీడు నేలనంత మాగాణి చేసే..
వాడవాడలా అల్లిన నల్లాల నాడులు
మంచి నీళ్ళను నట్టింట చేర్చే
మంది దప్పికను ఘనముగా తీర్చే..
కాలగర్భాన కలిసినట్టి
కాకతీయుల నాటి చెరువులన్ని
నేటి పాలనలోన నీటి చెలమలయ్యే
చరితకు భవితకు
నడుమ గొలుసులయ్యే..
వృత్తుల పరిరక్షణ, వృద్దుల సంరక్షణ
యువతకు శిక్షణ, ఆడబిడ్డల రక్షణ
విద్యా వైద్యముల ఉద్ధరణ
సేద్యానికి ఆదరణ ఉద్యోగాల కల్పన
స్వయం సమృద్ధి సాధన
అవినీతి ప్రక్షాళన, సుస్థిర పాలన
సంక్షేమ భావన, వృద్ధి దారుల శోధన
నడుస్తోంది నా తెలంగాణ
జగతి జేజేల పొంది ప్రగతి త్రోవన..
జనుల దీవెనలంది శర వేగాన
ఆదర్శ రాష్ట్రమై దేశపు శిఖర భాగాన…
– డాక్టర్ డి.వి.జి. శంకర రావు, 94408 36931
(మాజీ ఎంపీ, పార్వతీపురం, ఆంధ్రప్రదేశ్)