అతని మాట..పాటగా మారుతుంది
అతని పాట..కావ్యమై నిలుస్తుంది
ఆయన సినీ గీతాలు
కురిపించును పగలే వెన్నెలలు
ఆయన కావ్యసుమాలు
వెదజల్లును మానవతా పరిమళాలు..
అతని కలం కదిలితే చాలు
కమనీయ కవితా సెలయేరు
గలగలా పారు
అతని గళం పలికితే చాలు
జుంటి తేనియ జలజలా జాలువారు..
కవిత్వం నామాతృభాష అన్నాడు
తన మాతృభాషతో మకరందం పంచాడు
కవిత పదములకు లయ నేర్పినాడు
తెలుగు కవితకు చిరునామా అయినాడు..
హనుమాజీ పేటలో పుట్టినాడు
అఖిలభారతానికే గర్వకారణమయ్యాడు
విశ్వంభర కావ్యం సృష్టించాడు
జ్ఞానపీఠం అధిష్ఠించినాడు..
నిత్యనూతన కవితామూర్తిగా వెలిగాడు
సాహితీగగనాన ధ్రువతారగా నిలిచాడు
వీధి నుంచి విశ్వంభర దాకా
ఎగిసింది సినారె కీర్తి పతాక
-బూర దేవానందం
81435 89789