‘మనం లోంచి నేను…మనది లోంచి నాది’
పునాదుల్ని వెక్కిరిస్తూ ఫెళ ఫెళమంటూ వంతెనలు కూలిపోతాయి
పునాదుల్ని వెక్కిరిస్తూ
ఫెళ ఫెళమంటూ
వంతెనలు కూలిపోతాయి
స్నేహ నది బిత్తరపోతుంది
ఆత్మీయ ఆకాశం బావురుమంటుంది
రెండు తీరాల నడుమ
గాలి స్తంభించిపోతుంది
ఓయ్ అంటే ఓయ్ అనే
ధ్వనీ ప్రతిధ్వనులు మూగబోతాయి
బాల్యం నుంచీ పిట్టగోడల్లో మొలిచి చిగురించిన
పచ్చదనం మాడిపోయి
ఇనుప ప్రహరీలు నిలబడతాయి
ఊపిరాడ్డం మొదలయినప్పటినుంచీ
ఊహలు ఊపిరి పోసుకున్నప్పటి నుంచీ
మొలకెత్తీ విస్తరించిన బంధాలు
పరిమళాల్ని పోగొట్టుకుంటాయి
వసంతం వలసబోతుంది
బతుకు లెక్క మారిపోతుంది
జమా ఖర్చులే
బ్రహ్మజెముళ్లలా ముందుకొస్తాయి
నమ్మకాలు నడిబజార్లో
అమ్మకానికొస్తాయి
ఇదంతా యథాలాపంగానో
అన్యాపదేశంగానో జరగదు
మనం లోంచి ‘నేను’
మనది లోంచి ‘నాది’
తలెగరేసిన క్షణమే ‘ఖాళీలకు’
బీజం పడుతుంది
ముచ్చట్లకు ముచ్చెమటలు పడతాయి
సంభాషణలకు సమాధులు వెలుస్తాయి
దూరాలు ఉత్తర దక్షిణ ధృవాలవుతాయి
సంతోషాలు ఆగమయి ఎడారిలో కలుస్తాయి
వారాల ఆనంద్ 94405 01281
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

