నీ జ్ఞాపకం నిత్య వసంతం
ఆటపాటల పదకొండేళ్ల బాల్యాన్ని దాటి సంక్లిష్టమైన బాల్య, తరుణాల జుగల్ బందీ కచేరీ అయిన పన్నెండేళ్లనూ దాటేసి నన్ను నే నర్థం చేసుకుంటూ నా జీవనగీతాన్ని శృతి చేసుకుంటున్నప్పుడు దూరాల నుంచి విచ్చేసిన నీవు మలయసమీరసఖులతో కలిసి నా ప్రాంగణంలో చొరవగా ప్రవేశించావు!
ఆటపాటల పదకొండేళ్ల బాల్యాన్ని దాటి
సంక్లిష్టమైన బాల్య, తరుణాల
జుగల్ బందీ కచేరీ అయిన
పన్నెండేళ్లనూ దాటేసి
నన్ను నే నర్థం చేసుకుంటూ
నా జీవనగీతాన్ని శృతి చేసుకుంటున్నప్పుడు
దూరాల నుంచి విచ్చేసిన నీవు
మలయసమీరసఖులతో కలిసి
నా ప్రాంగణంలో చొరవగా ప్రవేశించావు!
పట్టపగలే మరో ఉదయం వలె
నీ బంగారు రూపంతో కాంతిని
ప్రసరించావు!
అపరిచితురాలివైనా
ఎంతో పరిచయమున్నట్లే
కోటిమెరుపుల కలగలుపైన
నీ నీలనయనానుగ్రహకాంతిని
నాపై పరిచి పలుకరించావు!
ఏ అమ్మాయిల చూపులను
పట్టించుకోని నా పెంకెతనాన్ని
తృటిలో బద్దలు కొట్టేశావు!
క్షణంక్షణం నాకు అందాల కలలను ప్రసాదించావు!
నా ఊహల్లోనూ, భావాల్లోనూ,
ఆలోచనల్లోనూ కొత్త వెలుగులు
నింపావు!
నా ప్రతి ఆశయానికీ ఆత్మగ
నిలిచావు!
నేను చేసే ప్రతిపనికీ ప్రేరణ
వయ్యావు!
నా మనోరాజ్యాన్ని నీ ఆధీనం
లోకి తీసుకున్నావు!
నీ మాటని నా పాటగ చేశావు!
కానీ ఆశ్చర్యంగా నీ సొంత
సామ్రాజ్యానికి ఉలుకూ
పలుకూ లేక వెళ్లిపోయావు!
ఏదేమైనా నీ సన్నిధిలోని
ప్రతిక్షణం అపురూప జ్ఞాపకమైంది!
నీ ఆత్మీయనామస్మరణే
నా జీవితంలో నిత్యవసంతం!
– రఘువర్మ (టీయల్యన్) 92900 93933
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

