పత్తి గింజల్లెక్క
పత్తి శేన్ల గడ్డికప్పిన మొక్క మొక్కకు కలుపు తీశి ఎల్లిపోతుంటే అవ్వ కాళ్లకు మొక్కలన్నీ వంగి వంగి దండాలు పెట్టేవి
పత్తి శేన్ల గడ్డికప్పిన మొక్క మొక్కకు
కలుపు తీశి ఎల్లిపోతుంటే
అవ్వ కాళ్లకు మొక్కలన్నీ
వంగి వంగి దండాలు పెట్టేవి
మొక్కలెండిపోతుంటే.. గొంతెండిపోతున్నా నాయిన
పాయలు పాయలుగా పాపడ దీశినంత సక్కంగా
సాల్లు దీశి నీళ్లు తాపినప్పుడు
సాలు సాలు నాయిన గరుకు
శేతులను గావురంగా ముద్దాడేటివి
రోగమొచ్చి ఆకులన్నీ ముడుసుకున్న పత్తి శెట్లను
జ్వరమొచ్చి మలుసుకుపన్న శిన్న శెల్లెని జూసుకున్నంత
పాయిరంగ జూసుకునేటిది
మబ్బు తునుకలు తునుకలుగా ఇరిగి నేలమీద పడ్డట్టు
శేను శేనంతా ఇచ్చుకున్న పత్తి కాయలు
నల్లరేగడి తీరు ముఖాలపై పూసిన నవ్వులు
ఒక్కతీరుగనె ఉంటయి
శేను శేనంతా పూసిన పత్తి బుగ్గల మీద
ప్రేమగా నిమిరి సంబురపడ్డ ఆ ఇద్దరూ..
ఇశిరిశిరి కొట్టిన ముసురు వానల
నేలరాలిన పత్తి నీళ్లల్ల కొట్టుకుపోతుంటే
చేతికచ్చిన కొడుకు కండ్లముందట కాలం జేస్తే
గుండెపగిలి సచ్చినట్టూ..
రెక్కల కట్టం నీళ్లల్ల కలిసి
తెల్లగా తేలాడుకుంటా పోతుంటే
అవ్వా నాయినలు
మట్టిపెడ్డల కింద మొలువని
పత్తి గింజల్లెక్క మట్టిల గలిసిపోయిండ్రు
– దిలీప్.వి 84640 30808
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

