స్వచ్ఛమౌ గాలి పీల్చుట ప్రజల హక్కు

పచ్చని పట్టుచీర మురిపమ్ముగ గట్టి, పరీమళమ్ముతో
మెచ్చుగ గాలి తెమ్మెర లమేయ సుగంధము లద్ద, ప్రేమతో
నిచ్చలు పల్కరింపగను నిర్మలమౌ చిగురాకు సవ్వడుల్
అచ్చపు సొమ్ములౌ హరిత హార విశోభల తన్మయాత్మయై!
ఉదయ కిరణ భూతిఁ హృదయమ్ము రమియింప
పరవశించి ప్రకృతి పల్లవించు
ప్రాణవాయువు నిచ్చు పచ్చదనము నిచ్చు
జీవ వాహినులిచ్చు జీవ మిచ్చు
లలిమీర యెండలు పలకరించిన, వాని
జల్లించి యిచ్చును చల్లదనము
పత్రహరితమ్మును ప్రసవించి జీవుల
ఆకలి దీర్చును అనవరతము
ప్రకృతి రక్షింప, రక్షింప బడును జగతి
భావి తరములు దీపించు ప్రజ్ఞ గలిగి
స్వచ్ఛమౌ గాలి పీల్చుట ప్రజల హక్కు
ప్రభుత బాధ్యత దాని కాపాడు టెన్న!
పాడి పంటలతోడ పాటీర శోభలు
వ్యాపించు జగతిఁ సంపదలు బెరుగు
తాపంబు దీరిన ధాత్రి విశాలాక్షి
చల్లంగ జూచు నీ జనుల నెల్ల
ఆహ్లాద భరితమౌ హరితహార వెలుంగు
లభ్యుదయాధ్వమ్ము నందు నడుపు
భద్రమై శాంతమై పర్యావరణమొప్పి
సకల విపత్తుల సమయ జేయు
దాని గుర్తించి ప్రభుతయు మానితముగ
హరిత నిధినొండు కల్పించి అందు ప్రజల
సాయ మర్థించు చున్నది, సార మతులు
రండు ఏకమై శ్రేయమ్ము లందు కొనుగ!
పాలకుర్తి రామమూర్తి
94416 66943
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Satyavathi Rathod | సత్యవతి రాథోడ్‌కు కేటీఆర్ బర్త్ డే విషెస్.. వీడియో
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
Cult | విశ్వక్ సేన్ ‘కల్ట్’ ఫస్ట్ డే కలెక్షన్లు.. భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచిందా, బ్రేక్ ఈవెన్‌కు ఎంత రావాలంటే?
Conrad Star Hotel: బెంగుళూరు ఫైవ్ స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో కరెంట్ షాక్.. ఇద్దరు విదేశీయులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

