రాళ్లు మోయడమేనా
మోసి మోసి భుజాలు రాళ్లయ్యాయి
రాళ్లు కొట్టడమేనా
కొట్టి కొట్టి చేతులు రాళ్లయ్యాయి
రాళ్లు మోస్తేనే సరిపోదు
కొడ్తేనే సరిపోదు
నేడైన గోడకట్టడం నేర్చుకో
రేపైన అడ్డుగోడల్ని కూల్చడం నేర్చుకో
వుట్టి గోడైన మట్టి గోడైన గోడ గోడే
మన గోడైన చైనా గోడైన గోడ గోడే
గోడలు గొడవలు వద్దు
గోడ దూకేవాళ్లు
గోడకు కన్నంవేసే వాళ్లూ
శత్రువులు
– కోటం చంద్రశేఖర్ 9492043348