కొత్త గాలి

వాడ వాడ
పోచమ్మ తల్లికి బోనమెత్తుకున్నట్టు
ఊరు ఊరంతా
కళకళలాడుతున్న పండుగ
పండుగంటే
మామూలు పండుగ గాదు
అంతెత్తు గొడుగై నిలబడు
ఆకుపచ్చని నవ్వు పాపల బారసాల
మెతుకు పండు సంబురం
చెరువు నిండి అలుగు దునికే
నీళ్ళు వొలుకబోసే
మబ్బు చుట్టాల్లా
హరిత వనాలు పాడుతున్న పండుగ
ఇంటింటీ మొక్క
బంగారు తెలంగాణ ముడుపు
అవి నీకు మొక్కలే
నాకు మాత్రం ఏసీలు
గాలి పంకలు
నిలువెత్తు వింజామరలు
అవి గుంతలు గావు
మట్టిని బతిమాలి
పలుగు పారా తొవ్విన
ప్రాణవాయువు నిలబడు పునాదులు
నగరం మీద వాలిన ఓ పావురమా
ఆ కాంక్రీటు వీధులలో
ఆ ఆకాశమెత్తు భవంతులలో
నువ్వు జరుపుకోలేని పండుగ
నువ్వు ఊహించని పండుగ
ఊరుతల్లి జరుపుతున్నది
ఓ చెయ్యేసి
కొంచెం కొత్త గాలి
గుండెకెత్తుకుని పోదువు రా… రా…!.
-గజ్జెల రామకృష్ణ
89774 12795
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

