భారతదేశంలో నదీనదాలు పొంగిపొర్లి
నలు దిశలా పచ్చని పంట పొలాలతో
బక్క చిక్కిన రైతుల బతుకులు బాగుపడ్డాయని!
ఉచిత వంటగ్యాసులొచ్చి సామాన్య
ప్రజానీకం ఉప్పొంగిపోయారని!
నేను కలగన్నాను
డాలర్ రేటు ఢీలా పడిపోయినట్టు!
స్విస్ బ్యాంకుల నల్లధనం మనకే వచ్చినట్లు!
జన్‌ధన్ ఖాతాలల్ల లక్షల కొద్ది ధనం జమ అయినట్లు!
నేను కలగన్నాను
ఈ దేశంలో కుల మతాలు సమసిపోయినట్టు!
అవినీతి అడుగంటి పోయినట్టు!
నేను కలగన్నాను
నా దేశం శాంతి సామరస్యాలతో
పరిఢ విల్లుతుందని!
నేనింకా కలగన్నాను
ఈ దేశం అగ్రదేశంగా
ప్రపంచ వార్తల్లోకెక్కినట్టు!
ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినట్టు!
నేనిప్పుడు కళ్ళు తెరిచాను
అరెరే ఎనిమిదేళ్లు గడిచినయ్!
ఎక్కడున్న గొంగడి అక్కడే ఉంది.
వాళ్లు అర్ధాకలితో బుడ్డ గోచీతో
తిరుగుతూనే ఉన్నారు
ఇప్పుడు వాడొస్తున్నాడు
వాడి విష కౌగిలిలో నిన్ను బంధించి
పక్కటెముకలు విరిచి
ఊపిరి తీయాలనుకుంటున్నాడు.
జర జాగ్రత్త సుమీ!
కారం శంకర్
7396199884