కుర్చీపై కూర్చున్నాక
అధికారం తలకెక్కాక
లేళ్లు సింహాలు గర్జిస్తాయి!
పాలన మరిచి
వేటను ఆటగా చేసుకుంటాయి!
అభివృద్ధి, సంక్షేమం
ఎజెండా మ్యానిఫెస్టో పక్కనపెట్టి
ప్రతిపక్షాన్ని కక్షగట్టి
సాధించడమే పనిగా పెట్టుకోరాదు!
ఓడిన పార్టీ చెడ్డదనో
గెలిచిన పార్టీ మంచిదనో
మనకు మనమే సిద్ధాంతీకరిస్తే
ప్రజాస్వామ్యం బతికేది ఎలా?
చట్టం తన పని తాను
చేసేలా చూడాలి
పగపట్టడమే పనిగా పెట్టుకోవడం
అంగీకారయోగ్యం కాదు!
మాట మాటకు వ్యంగ్యత
మాటకారితనమేమో!
మంచితనమైతే కాదు!
విషయం లేకుండా
విమర్శనే నమ్ముకుంటే
ప్రజలకు సమ్మతమేనా?
ఓడిన పార్టీ నిలబడి
పోరాడాలి!
గెలిచిన పార్టీ పడిపోకుండా నిలబడాలి!!
ఓడిన పార్టీ ఏదని కాదు
గెలిచిన పార్టీ ఏమి చేస్తుంది
అని చూస్తారు ప్రజలు
మంచి జరిగితే హర్షిస్తారు!
అవకాశం అందరికీ రాదు
అందిపుచ్చుకుంటే ఆకాశమంత!
ఎవ్వరూ కాదు శాశ్వతం!
మార్పు ఒక్కటే శాశ్వతం!!
జగ్గయ్య.జి
98495 25802