తెలంగాణ సాహితీ ప్రతాప కీర్తి!
అతడు తెలగాణ సాహిత్య హర్మ్య దీప్తి అతడు తెలగాణ కీర్తి సంగతుల వరము భాసురోన్ముఖ సురవర వంశ గరిమ సాహితీ ప్రతాపుని కిల సాటి యెవరు
అతడు తెలగాణ సాహిత్య హర్మ్య దీప్తి
అతడు తెలగాణ కీర్తి సంగతుల వరము
భాసురోన్ముఖ సురవర వంశ గరిమ
సాహితీ ప్రతాపుని కిల సాటి యెవరు?
అతడు ప్రతాపరెడ్డి, ఘనమైన తెలుంగు కృషీవలుండు, సం
తత తెలగాణ రాజిత ప్రధాన వెలుంగు కవీంద్ర కోటికిన్
వ్రతముగ వాఙ్మయార్చనల వాసిగ జేసిన తత్వదర్శి, సం
హిత రచనా ప్రవాహముల కేతము వట్టిన కర్షకుండహో!
వరనిధి గోలుకొండ కవివాణుల సంకలనమ్ము దీర్చి, తా
విరియగ జేసె మాతృధర వేదన శోధన రాటుదేలగా
సురవర జాలమెల్ల పరిశోభితమై విలసిల్లనో యనన్
పరిమళ మొప్పు మాటలను భాసిల జేసెను పుస్తకావళిన్!
నవవైతాళికుడై యశేష యశమున్ నానావిధ ప్రాభవ
వ్యవసాయమ్మున తీర్చిదిద్ది తెలగాణానంద సంధాయియై
భువిలో నిల్చెడి గ్రంథరాజములతో భూషించె రోచిన్ సదా
భవిమద్వ్యాస సుధాస్రవంతులను తాసాగించి సత్కీర్తియై!
అతని జన్మదినము శ్రుతమయ్యే శృతియయ్యె
అతని లక్ష్యపథము వితథమయ్యె
అతని కీర్తివెలుగు నాచంద్రతారార్క
మవని కవనసీమ నక్షయముగ!
(నేడు తెలంగాణ సాహితీ వైతాళికుడు సురవరం
ప్రతాపరెడ్డి జయంతి సందర్భంగా..)
– డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ
94404 68557
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

