నా తెలంగాణ నాడు నవ తెలంగాణ
నేడు అభివృద్ధి తెలంగాణ
నిండిన చెరువులు నీళ్లతో
జలకళలాడుతున్నాయి
జనం హృదయాల్లో
జన జయకేతనంAAAAAAAAAAAAAAAA
పైరు నేలకు
పచ్చని రంగేసినట్టు
పండే పంటల
పచ్చని తీరు చూడాలి
దున్నే దుక్కిల
దుమ్ము లేవకుండా
దుఃఖం ఆరింది
ధూపారి మొక్కలు
పచ్చని హరితహారం
ప్రకృతి పల్లె వనం పార్కులు
సంక్షేమ పథకాలు
ఇంటింట సంతోషాలు
రైతు బీమా పథకం
రైతన్న ఇంట్ల ధీమా
కళ్యాణలక్ష్మి
కన్నీరు తుడిచింది
రైతన్న పంటకు
రైతుబంధు మేలు
దళిత బంధు పథకం
దళితుల ఉపాధి సంక్షేమం
-దేవరపాగ కృష్ణయ్య
99634 49579