పిల్లల ఒంటి పై నెమిలికల కట్టతో నవ్వుతూ
మృదువుగా రాస్తాడు !
గాలి గమ్మత్తుగా తాకినట్లే
ఏ బాధా ఉండదు
పిల్లలకు పెయి నిండా పులకరింతలే !
ఫకీర్ సాహెబ్ పిల్లల మెడలో
చిన్న తాయెత్తు వేస్తాడు
వాళ్లు తాయెత్తుతో ఆడుతూ
వచ్చిన జ్వరాన్ని మరిచిపోతారు
పిల్లల పేర పెదాలు కదిలిస్తూ
మెల్లిగా దువా చదువుతాడు!
సాత్ వీ మంజిల్ దాటి
దువా అల్లాకే వినిపిస్తుంది
మా వాడకట్టులో చిన్న గూన ఇంటిలో
నివసించే ఫకీర్ సాహెబ్ వాకిట్లో
ఉదయం నుంచి రాత్రి వరకూ ఒడవని క్యూ
మందులు లేవు మాత్రలు లేవు
సూటిగా మనసుకు తృటిలో బలాన్ని ఇస్తాడు
యా ఖుదా !
దువాయే దవా !
-కందాళై రాఘవాచార్య , 87905 93638