యోగ నిద్రలోనే
నీ జిత్తులన్నీ..!!
మౌన ముద్రలోనే
నీ ఎత్తులన్నీ..!!
ఎత్తులకెత్తేస్తావు
ఎత్తి కుదేస్తావు..!!
అర్థంకాని ఆటలెన్నో..
బతుకులో ఆడించేస్తావు..!!
వేదనలో ముంచేస్తావు
జీవన వేదాలనే నేర్పేస్తావు..!!
ఆశల గంధాన్ని పూస్తావు
అనుబంధాల ముడి విప్పేస్తావు..!!
అర్ధంతరంగా మా
ఆటనే ముగించేస్తావు..!!
ఆపద సృష్టించేది నీవే
పదమని నడిపించేదీ నీవే…!!
నీలకంధరుడవు నీవు
ఈ ఇల నీ లీలలకు నెలవు..!!
సర్వలోక తిమిరసంహారా..
సకల కర్మల పాప పరిహారా..!!
మరుభూమి నీ నివాసమే..
మాకు మోక్షమిచ్చు కైలాసమే..!!
నిరాకారా.. శంకరా..
హరహరా.. పరమేశ్వరా..
నమో నమః
పేరిశెట్టి బాబు, 92471 70800