ఆ ఎర్ర రంగు డబ్బా
ఎన్ని భావోద్వేగాలను
దాచుకునేదో ఆ రోజుల్లో!
నిరుద్యోగుల ఎదురు చూపులను..
కన్నవారి కోటి కలలను..
ప్రేమికుల ఊహల ఊసులను..
దంపతుల విరహ బాధలను
సైనికుల త్యాగ గాథలను!
చారిత్రక సత్యాలను..
స్నేహ బంధాలను..
అనురాగాలను..
అనుబంధాలను..
ఆనందాలను..
ఆవేదనలను..
శుభ, అశుభ వార్తలను..
మరెన్నో అనుభూతులను!
భద్రంగా దాచి ఉంచే
అపురూపమైన
అక్షర లక్షల పేటిక అది!
నేడు ప్రాముఖ్యత కోల్పోయిన
చారిత్రక భాండాగారమది!
అమూల్యమైన ఖజానాయే అది !!!
-చంద్రకళ దీకొండ
93813 61384