ఊరూరా ఊరి మధ్య ఊరడమ్మ
ఊరడమ్మ ముందు బొడ్రాయి
పనిమీద పోయే వారిని తనను
చూడమంటుంది!
ఊరి గవిని ముందు
వచ్చిపోయే వారికి ఆశీస్సులు!
ఊరందరి వేల్పు బొడ్రాయి
కష్ట సుఖమునందు అండగా
పూజలందుకొను ముందుగా
ఊరి పొలిమేర లోపల
ఊరు బాగోగుల నిర్ణయాలన్నీ
బొడ్రాయి వద్దే!
అంటే…
స్వర్గంలో ఇంద్రసభ లెక్క!
ఇప్పటి పోలీస్ స్టేషన్లు
న్యాయస్థానాల లెక్క
బొడ్రాయికి బొట్టుపెట్టి ఒట్టేస్తే
తగాదాలన్నీ పరిష్కారమైనట్లే!
తెలంగాణ ఉద్యమాలకు వారధి
‘వేదిక’ నాంది పలికింది
బొడ్రాయి ‘బొట్టు’ పెట్టి
ఊరికి ఊరు తరలింది
ఢిల్లీ గల్లీ గల్లీ ఊదరగొట్టింది
ఇంతింతై వటుడింతైనట్లు
బొడ్రాయి మహిమ తెలిసింది!
తెలంగాణ రాష్ట్రం సాకారమైంది
‘బొడ్రాయి’ ఇపుడు ఊరూరా
నిత్య పూజలు అందుకుంటుంది..
-పి.బక్కారెడ్డి
97053 15250